US Birth Rate Decline: అమెరికాలో భారీగా పడిపోయిన జననాల రేటు
ABN, Publish Date - Jul 25 , 2025 | 03:36 AM
అమెరికాలో సంతానోత్పత్తి దారుణంగా పడిపోతోంది. గతంలో ఎప్పుడూ లేనంత తక్కువగా గత..
న్యూయార్క్, జూలై 24: అమెరికాలో సంతానోత్పత్తి దారుణంగా పడిపోతోంది. గతంలో ఎప్పుడూ లేనంత తక్కువగా గత ఏడాది జననాల రేటు నమోదైౖంది. 2024కు సంబంధించి వ్యాధి నియంత్రణ, నివారణ సెంటర్లు (సీడీసీ) తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో సంతానోత్పత్తి తగ్గిపోయిన విషయం స్పష్టమైంది. జనాభా భర్తీ రేటు ప్రకారం సగటున ప్రతి మహిళకు 2.1 కంటే ఎక్కువగా పిల్లలు ఉండాల్సిన తరుణంలో.. అమెరికాలో జననాల రేటు 1.6 కంటే తక్కువగా నమోదైందని సీడీసీ వెల్లడించింది. 1960ల్లో యూఎ్‌సలో జననాల రేటు సుమారు 3.5గా ఉంది. ఆ తర్వాత నుంచి క్రమంగా క్షీణిస్తూ వస్తోంది. జననాల రేటు తగ్గిపోతోందన్న హెచ్చరికల నేపథ్యంలో ట్రంప్ ప్రభుత్వం సంతానోత్పత్తిని పెంచడానికి ఇటీవల చర్యలు చేపట్టింది.
ఈ వార్తలు కూడా చదవండి..
చెన్నైలో 4 చోట్ల ఏసీ బస్స్టాప్లు
ఈ రోజు ఉదయం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..
For More National News And Telugu News
Updated Date - Jul 25 , 2025 | 03:36 AM