Treasure: హైకింగ్‌కు వెళ్లిన ఇద్దరికి జాక్ పాట్.. కాళ్ల కింద కోట్ల నిధి
ABN, Publish Date - May 03 , 2025 | 01:14 PM
సరదాగా హైకింగ్‌కు వెళ్లిన ఇద్దరు పర్యాటకులు పెద్ద జాక్ పాట్ కొట్టారు. చెక్ రిపబ్లిక్‌లోని పోడ్కర్కోనోసి పర్వతాల్లో 1808 కాలం నాటి పెద్ద మొత్తంలో ఆభరణాలు, నాణేలు గుర్తించారు.
Treasure: చెక్ రిపబ్లిక్‌లో హైకింగ్‌కు వెళ్లిన ఇద్దరు వ్యక్తులకు అదృష్టం కాళ్ల కిందికి వచ్చింది. దట్టమైన అడవి అంచున నడుస్తుండగా పెద్ద మొత్తంలో నిధిని కనుగొన్నారు. ఈ నిధిలో బంగారు నాణేలు సహా అనేక వస్తువులు గుర్తించారు. ఆ నిధి మొత్తం బరువు దాదాపు 7 కిలోలు ఉంటుందని ఈ వస్తువులను స్వాధీనం చేసుకున్న మ్యూజియం అధికారులు అంటున్నారు.
ఓ రాతి గోడలోని రెండు కంటైనర్లలో ఈ నిధి దొరికిందని తూర్పు బొహేమియా మ్యూజియం తెలిపింది. మొదట, పర్యాటకులు 598 బంగారు నాణేలు ఉన్న అల్యూమినియం బాక్స్‌ను చూశారు. దానిని నల్లటి వస్త్రంలో చుట్టి ఉంచడం గుర్తించారు. దాదాపు మూడు అడుగుల దూరంలో వారికి 16 పొగాకు సంచులు, 10 బ్రాస్లెట్లు, సన్నని వైర్ మెష్ తో తయారు చేసిన సంచి, ఒక దువ్వెన, ఒక కీ చైన్ దొరికాయి. ఆ వస్తువులు పసుపు లోహంతో తయారు చేయబడ్డాయని, అవి ఒక లోహపు పెట్టెలో దొరికాయని మ్యూజియం తెలిపింది.
ఐదు దేశాల కరెన్సీలు
ఈ నిధిలో ఫ్రాన్స్, బెల్జియం, ఒట్టోమన్ సామ్రాజ్యం, ఆస్ట్రియా-హంగేరీ దేశాల కరెన్సీలు ఉన్నాయి. కరెన్సీపై ఉన్న చిన్న గుర్తులు 1918 నుండి 1992 వరకు యుగోస్లేవియాలో ఉపయోగం కోసం దీనిని ముద్రించారని సూచిస్తున్నాయి.
100 సంవత్సరాలు ఖననం
ఒక మ్యూజియం నిపుణుడి అభిప్రాయం ప్రకారం, ఈ నాణేలు వంద సంవత్సరాలకు పైగా భూమిలో దాగి ఉన్నట్లు కనిపిస్తున్నాయి. వీరి కాలం 1808 నుండి 19వ శతాబ్దం ప్రారంభం వరకు. ఈ నాణేలను బహుశా 1921 తర్వాత పాతిపెట్టి ఉంటారని స్థానిక మీడియా నివేదించింది.
పురావస్తు శాస్త్రవేత్త ఏమి చెప్పాడు?
మ్యూజియం పురావస్తు శాఖ మిరోస్లావ్ నోవాక్ మాట్లాడుతూ, ఇవి చాలా ప్రత్యేకమైనవని, అయితే భూగర్భంలో నిధిని పూడ్చడం చరిత్రపూర్వ కాలం నుండి సాధారణం అని అన్నారు. తరచుగా అలా నిధిని పాతిపెట్టేవారని, తరువాత వాటిని తిరిగి తీసుకోవచ్చనే ఉద్దేశ్యంతో అలా చేసే వారని తెలిపారు.
నిధిపై పరిశోధన
నిపుణులు ఇంకా ఇతర వస్తువుల మూలాన్ని గుర్తించలేదు. వస్తువులను విశ్లేషించి, ఇవి ఏ లోహంతో తయారయ్యాయో గుర్తించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
Also Read:
Asia Cup 2025: పహల్గామ్ దాడి, ఆసియా కప్‌పై ప్రభావం.. జరగకపోతే ఎవరికి నష్టం..
Suicide Bomb : మోదీ.. నాకొక సూసైడ్ బాంబ్ ఇవ్వండి.. పాక్ వెళ్తా.. కర్ణాటక మంత్రి కామెంట్స్ వైరల్..
Kedarnath Dham Yatra 2025: తెరుచుకున్న కేదార్‌నాత్ ఆలయం.. తొలి రోజు భారీగా తరలివచ్చిన భక్తులు
Updated Date - May 03 , 2025 | 02:43 PM