ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Trump health advice: ఆ మాత్రలకు దూరంగా ఉండండి.. అమెరికా అధ్యక్షుడి హెచ్చరిక..

ABN, Publish Date - Sep 23 , 2025 | 09:28 AM

అమెరికాలో ఆటిజంతో బాధపడుతున్న వారి సంఖ్య దశాబ్దాలుగా పెరుగుతోంది. యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) డేటా ప్రకారం, ప్రతి 36 మందిలో ఒకరు ఆటిజంతో బాధపడుతున్నారట. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు.

Trump Tylenol pregnancy warning

అమెరికాలో ఆటిజంతో (Autism Risk) బాధపడుతున్న వారి సంఖ్య దశాబ్దాలుగా పెరుగుతోంది. యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) డేటా ప్రకారం, ప్రతి 36 మందిలో ఒకరు ఆటిజంతో బాధపడుతున్నారట. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. పెయిన్ కిల్లర్‌గా ఉపయోగించే టైలెనాల్‌ వల్లే ఆటిజం సమస్య వస్తోందని పేర్కొన్నారు. గర్భవతులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మందును తీసుకోవద్దని సూచించారు (Trump Tylenol pregnancy warning).

గర్భధారణ సమయంలో టైలెనాల్ తీసుకునే మహిళలు ఆటిజం స్పెక్ట్రం డిజార్డర్ ఉన్న పిల్లలకి జన్మనిచ్చే ప్రమాదం ఉందని ట్రంప్ పరిపాలనా విభాగం భావిస్తోంది (Tylenol autism link). దీంతో టైలెనాల్ తీసుకోవద్దని ప్రకటన చేసింది. అయితే ఆటిజంకు టైలెనాల్ కారణమనే వాదనలో శాస్త్రీయత లేదని నిపుణులు కొట్టిపడేశారు. ఆటిజంకు జన్యుపరమైన కారణాలే కీలకం అని వాదిస్తున్నారు. జన్యు ఉత్పరివర్తనాలతో పాటు, కాలుష్య కారకాలు, దుమ్ము, మైక్రోప్లాస్టిక్స్, పర్యావరణ టాక్సిన్స్ వంటివి కూడా ఆటిజం ప్రమాదాన్ని పెంచుతాయని పరిశోధకులు చెబుతున్నారు (Trump autism claims).

ఏదేమైనా ఇటీవలి కాలంలో అమెరికాలో ఆటిజం సమస్య విపరీతంగా పెరుగుతోంది (Trump health advice). 2000లో ఆటిజం సమస్య ప్రతి 150 మంది పిల్లలలో ఒకరిని మాత్రమే వేధించేదట. 2020 నాటికి ప్రతి 36 మందిలో ఒకరు ఆటిజంతో బాధపడుతున్నారని తేలింది. ఈ నేపథ్యంలో ఆటిజంపై అమెరికాలో విస్తృతమైన పరిశోధనలు సాగుతున్నాయి. గర్భధారణ సమయంలోనూ, పుట్టిన తర్వాత ఇచ్చే టీకాలు ఆటిజానికి కారణమవుతున్నాయా? అనే పరిశోధనలు కూడా సాగుతున్నాయి. అయితే ఇప్పటివరకు ఆటిజానికి సరైన కారణమేంటో పూర్తి స్థాయిలో వెలుగులోకి రాలేదు.

ఇవి కూడా చదవండి..

మ్యాచ్ ఓడినా యుద్ధంలో గెలిచాం.. పాక్ క్రికెటర్ భార్య సంచలన పోస్ట్..


ఫర్హాన్ గన్ పేలిస్తే.. అభిషేక్, గిల్ బ్రహ్మోస్ ప్రయోగించారు: పాక్ మాజీ క్రికెటర్

మరిన్ని క్రీడా, అంతర్జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 23 , 2025 | 09:49 AM