ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Trump Threatens Probe Over EU: గూగుల్ కంపెనీపై భారీ ఫైన్.. ఈయూకు వార్నింగ్ ఇచ్చిన ట్రంప్..

ABN, Publish Date - Sep 06 , 2025 | 07:58 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగారు. గూగుల్‌తో పాటు యాపిల్ కంపెనీలకు అండగా నిలిచారు. యురోపియన్ యూనియన్ తమ దేశానికి చెందిన కంపెనీలపై భారీ జరిమానాలు వేయడాన్ని ఆయన తప్పుబట్టారు.

Trump Threatens Probe Over EU

అమెరికన్ టెక్ కంపెనీలు గూగుల్, యాపిల్‌కు యురోపియన్ యూనియన్ షాక్ ఇచ్చింది. ఆ రెండు మల్టీ నేషనల్ కంపెనీలకు భారీ జరిమానాలు విధించింది. సొంత ప్రకటనలకు అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ గూగుల్ సంస్థపై యురోపియన్ యూనియన్ 3.5 బిలియన్ డాలర్ల ఫైన్ వేసింది. మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే అక్షరాలా 3 లక్షల కోట్ల రూపాయలకు పైమాటే. యురోపియన్ యూనియన్ విధించిన జరిమానాతో గూగుల్ సంస్థ దిక్కుతోచని స్థితిలో పడిపోయింది.

ఇలాంటి సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగారు. గూగుల్‌తో పాటు యాపిల్ కంపెనీలకు అండగా నిలిచారు. యురోపియన్ యూనియన్ తమ దేశానికి చెందిన కంపెనీలపై భారీ జరిమానాలు వేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈయూకు పబ్లిక్‌గా వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు తన సొంత సోషల్ మీడియా ‘ది ట్రూత్‌’లో శుక్రవారం ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘ గూగుల్, యాపిల్ కంపెనీలపై వేసిన జరిమానాలను యురోపియన్ యూనియన్ వెంటనే రద్దు చేయాలి.

లేకపోతే సెక్షన్ 301 ప్రొసీడింగ్స్ మొదలు పెట్టాల్సి ఉంటుంది. టాక్స్ కడుతున్న అమెరికన్ కంపెనీలపై అక్రమంగా జరిమానాలు విధిస్తే సహించను’ అని అన్నారు. కాగా, డొనాల్డ్ ట్రంప్ అధికంగా టాక్స్‌లు కడుతున్న అమెరికన్ కంపెనీలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్‌పై పడ్డ యాంటీ ట్రస్ట్ కేసులో తీర్పు కంపెనీకి సానుకూలంగానే వచ్చింది. దీంతో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రభుత్వ సాయాన్ని ఆయన ప్రశంసించారు.

ఇవి కూడా చదవండి

జైలు బయట మాజీ ప్రధాని సోదరిపై గుడ్డుతో దాడి..

ముంబైకా రాజా.. రోహిత్ శర్మ కారును చుట్టుముట్టి ఫ్యాన్స్ హంగామా.. వీడియో వైరల్..

Updated Date - Sep 06 , 2025 | 08:10 AM