ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Donald Trump: కుమారుడికి సీటివ్వలేదనే హార్వర్డ్‌పై ట్రంప్‌ కక్ష?

ABN, Publish Date - May 29 , 2025 | 05:56 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చిన్న కుమారుడు బారన్‌కు సీటు ఇవ్వడానికి నిరాకరించినందుకే హార్వర్డ్‌ యూనివర్సిటీపై కక్ష సాధిస్తున్నారని పలువురు నెటిజన్లు ఆరోపిస్తున్నారు.

  • నెటిజన్ల ఆరోపణలు

వాషింగ్టన్‌, మే 28: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చిన్న కుమారుడు బారన్‌కు సీటు ఇవ్వడానికి నిరాకరించినందుకే హార్వర్డ్‌ యూనివర్సిటీపై కక్ష సాధిస్తున్నారని పలువురు నెటిజన్లు ఆరోపిస్తున్నారు. హార్వర్డ్‌తో పాటు కొలంబియా, స్టాన్‌ఫోర్డ్‌ వర్సిటీల్లోనూ సీటు దక్కకపోవడంతో న్యూయార్క్‌ యూనివర్సిటీకి చెందిన స్టెర్న్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినె్‌సలో ఫైనాన్స్‌ కోర్సు చదవడానికి బారన్‌ అడ్మిషన్‌ తీసుకున్నాడంటూ పోస్టులు పెడుతున్నారు.


అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా కుమార్తె మలియాకు 2017లో హార్వర్డ్‌ వర్సిటీలో సీటు లభించినా, బారన్‌కు మాత్రం సీటు దక్కలేదు. దీనిపై ఆగ్రహంతో ఉన్న ట్రంప్‌ హార్వర్డ్‌ వర్సిటీని టార్గెట్‌ చేశారని మరికొందరు విమర్శిస్తున్నారు. కాగా, అసలు హార్వర్డ్‌లో సీటు కోసం బారన్‌ ఎప్పుడూ దరఖాస్తు చేయనేలేదని ట్రంప్‌ సతీమణి మెలానియా ఓ ప్రకటనలో స్పష్టం చేశారు.

Updated Date - May 30 , 2025 | 02:58 PM