ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Donald Trump: అలా చేస్తే ఊరుకోను.. మస్క్‌కు ట్రంప్ సీరియస్ వార్నింగ్..

ABN, Publish Date - Jun 08 , 2025 | 12:29 PM

Trump Warning To Elon Musk: మస్క్ తీసుకుంటున్న నిర్ణయాలపై ట్రంప్‌కు ఎప్పటికప్పుడు సమాచారం వెళుతోంది. మస్క్ డెమోక్రటిక్ పార్టీకి ఫండింగ్ చేయబోతున్నాడన్న విషయం కూడా ట్రంప్‌కు తెలిసింది. దీంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Trump Warning To Elon Musk

ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ల మధ్య గొడవలు రోజు రోజుకు పెరుగుతూ పోతున్నాయి. ఒకరిపై ఒకరు మీడియా, సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేసుకుంటున్నారు. ఒకరిని దెబ్బ కొట్టడానికి మరొకరు ఎత్తులు వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మస్క్ కొత్త పార్టీ పెట్టడానికి సిద్దమయ్యారు. ఇప్పటికే పార్టీ పేరును కూడా ప్రకటించారు. అదే ఊపులో మస్క్ మరో దెబ్బ కొట్టడానికి సిద్దమయ్యారు. ఈ సారి రిపబ్లిక్ పార్టీకి చెందిన వారిని టార్గెట్ చేశాడు.


స్పెండింగ్ బిల్లుకు ఓటు వేసిన రిపబ్లికన్స్‌కు బుద్ధి చెప్పడానికి సిద్ధమయ్యారు. స్పెండింగ్ బిల్ ఆమోదం పొందకుండా వ్యూహాలు రచిస్తున్నారు. ఆ బిల్‌కు మద్దతు తెలిపిన అధికార రిపబ్లికన్ పార్టీ నేతలకు వ్యతిరేకంగా.. డెమోక్రటిక్ పార్టీకి ఫండింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. స్పెండింగ్ బిల్లుకు వ్యతిరేకంగా ఉన్న కొంతమంది డెమోక్రటిక్ పార్టీ ప్రజాప్రతినిధులు మస్క్‌ను కలిశారు. బిల్లుకు ఓటు వేసిన రిపబ్లికన్స్‌కు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి ఫండింగ్ చేయమని అడిగారు. దీనికి మస్క్ సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది.


మస్క్ తీసుకుంటున్న నిర్ణయాలపై ట్రంప్‌కు ఎప్పటికప్పుడు సమాచారం వెళుతోంది. మస్క్ డెమోక్రటిక్ పార్టీకి ఫండింగ్ చేయబోతున్నాడన్న విషయం కూడా ట్రంప్‌కు తెలిసింది. దీంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మస్క్ డెమోక్రటిక్ పార్టీ వారికి ఫండింగ్ చేస్తే గనుక.. తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఆయన మాట్లాడుతూ.. ‘డెమోక్రటిక్ పార్టీ వారికి ఫండింగ్ చేస్తే.. మస్క్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుంది. మస్క్ గౌరవం లేని మనిషి. ఆఫ్రికాలో పుట్టిన అతడితో బంధాన్ని చక్కబెట్టుకోవాలన్న కోరిక లేదు. మాట్లాడాలన్న ఉద్దేశ్యం కూడా లేదు’ అంటూ మండిపడ్డారు.


ఇవి కూడా చదవండి

70 ఏళ్లుగా సహజీవనం.. 90 ఏళ్ల వయసులో పెళ్లి..

కొత్త ట్రెండ్ .. అబ్బాయిలతో హగ్గుల కోసం ఎగబడుతున్న అమ్మాయిలు

Updated Date - Jun 08 , 2025 | 12:34 PM