ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Trump Putin Meeting: ఎటూ తేలకుండానే ముగిసిన ట్రంప్-పుతిన్ భేటీ.. తర్వాత మళ్లీ మాస్కోలో సమావేశం

ABN, Publish Date - Aug 16 , 2025 | 06:30 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ల మధ్య అలస్కాలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశం గురించి కీలక అప్డేట్ వచ్చేసింది. ఈ భేటీ గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. శుక్రవారం జరిగిన ఈ సమావేశం సానుకూలం అని ఇద్దరు నాయకులూ ప్రకటించారు. కానీ ఇందులో ఓ ట్విస్ట్ ఉంది.

Trump Putin Meeting

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య అత్యున్నత స్థాయి సమావేశం (Trump Putin Meeting) అలాస్కాలో 2:53 గంటలపాటు జరిగింది. ఈ భేటీ ఫలప్రదంగా జరిగినట్లు ఇద్దరు నాయకులు చెప్పినా, నిజానికి ఏదీ తేలలేదు. మాస్కోలో మరోసారి కలుద్దామని ప్రకటించారు. ఈ నేతలు సహకారంతో, పరస్పర గౌరవంతో కూడిన వాతావరణంలో చర్చలు జరిగాయని, అవి చాలా ఉపయోగకరంగా ఉన్నాయని పేర్కొన్నారు. కానీ అసలు విషయమైన ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి మాత్రం ఎలాంటి ఒప్పందం కుదరకుండానే చర్చలు పూర్తయ్యాయి.

పుతిన్ ఏమన్నారంటే

ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించిన అంశం ఉక్రెయిన్‎తో వివాదం. పుతిన్ మాట్లాడుతూ, ట్రంప్‌తో ఉక్రెయిన్ గురించి ఒక అవగాహనకు వచ్చామని చెప్పారు. కానీ యూరప్ దేశాలు ఈ పురోగతిని అడ్డుకోవద్దని హెచ్చరించారు. అంతేకాదు, మాజీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై కూడా విమర్శలు చేశారు. 2022లో ట్రంప్ అధ్యక్షుడిగా ఉండి ఉంటే ఉక్రెయిన్ యుద్ధం జరిగేది కాదని పుతిన్ అన్నారు.

బైడెన్‌తో 2022లో మాట్లాడినప్పుడు, పరిస్థితిని యుద్ధం వైపు తీసుకెళ్లొద్దని చెప్పాను, కానీ అందుకు ఆయన సహకారం తగ్గిందని పుతిన్ అన్నారు. కానీ ఇప్పుడు కొన్ని అంశాలకు పరిష్కారం దొరికిందని, పెండింగ్‌ అంశాలపై మాస్కాలో మరోసారి భేటీ ఉంటుందని పుతిన్‌ తెలిపారు. ఈ క్రమంలో ట్రంప్‌ను మాస్కోకు ఆహ్వానించారు.

స్వాగతించదగిన విషయం

ఉక్రెయిన్‌లో పరిస్థితులు రష్యాకు ముప్పుగా ఉన్నాయని పుతిన్ అన్నారు. ఈ సంఘర్షణకు కారణమైన అన్ని అంశాలనూ తొలగించాలని క్రెమ్లిన్ భావిస్తోందన్నారు. అయితే, ట్రంప్‌తో ఒక విషయంలో ఏకాభిప్రాయం కుదిరిందని పుతిన్ తెలిపారు. ఉక్రెయిన్ భద్రతను కాపాడాల్సిన అవసరం ఉంది, ఇది రష్యాకు కూడా స్వాగతించదగిన విషయమని, ఈ ఒప్పందం ఉక్రెయిన్‌లో శాంతి మార్గాన్ని సుగమం చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కీవ్, యూరప్ ఈ పురోగతిని సానుకూలంగా తీసుకుంటాయని, రహస్య ఒప్పందాలతో దీన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించవని ఆశిస్తున్నామని పుతిన్ పేర్కొన్నారు.

ట్రంప్ ఏం చెప్పారు?

ఈ విషయంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ, నాటో నాయకులతో త్వరలో మాట్లాడతానని ట్రంప్ అన్నారు. ఈ సమావేశం గురించి వారికి సమాచారం ఇస్తానని, అయితే ఉక్రెయిన్‌పై ఇంకా పూర్తి ఒప్పందం కుదరలేదని ఆయన అన్నారు. కొన్ని సమస్యలు ఇంకా పరిష్కరించాల్సి ఉందన్నారు. కానీ అవి పెద్దవి కావన్నారు. ఒక్కటి మాత్రం కీలకమని, మేం దాన్ని పరిష్కరించే మంచి అవకాశం ఉందని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. ఈ భేటీ రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారితీసింది. మళ్లీ మాస్కోలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి మరి.

ఇవి కూడా చదవండి

ఈ తేదీకి ముందే ఐటీఆర్ దాఖలు చేయండి… ఆలస్య రుసుమును తప్పించుకోండి

రైల్వే టిక్కెట్లపై 20% తగ్గింపు ఆఫర్.. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 16 , 2025 | 07:38 AM