ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Donald Trump: కుటుంబ వ్యాపారాల కోసం భారత్‌తో సంబంధాలను ట్రంప్ వదులకున్నారు: అమెరికా ప్రభుత్వ మాజీ సలహాదారు

ABN, Publish Date - Sep 02 , 2025 | 10:54 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై మాజీ జాతీయ భద్రతా సలహాదారు సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్‌‌తో తన కుటుంబ వ్యాపారాల కోసమే భారత్‌తో బంధాన్ని కాదనుకున్నారని ఆరోపించారు. ఇది పెద్ద వ్యూహాత్మక తప్పిదమని హెచ్చరించారు.

Jake Sullivan

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌పై అసంబద్ధ రీతిలో 50 శాతం సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌‌పై అంతకంతకూ విమర్శలు పెరుగుతున్నాయి. స్వీయ ప్రయోజనాల కోసం ట్రంప్ భారత్‌తో సంబంధాలను దెబ్బతీశారని అమెరికా జాతీయ భద్రత మాజీ సలహాదారు జేక్ సులేవాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్‌తో తన కుటుంబ వ్యాపార ఒప్పందాల కోసం భారత్‌తో సంబంధాలను వదులుకున్నారని అన్నారు. తన యూట్యూబ్ ఛానల్‌లో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

‘భారత్ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశం. ఇండియాతో ఒప్పందాలు బలోపేతం చేసుకునేందుకు అమెరికా దశాబ్దాల పాటు కృషి చేసింది. సాంకేతిక, ఆర్థిక అంశాల్లో ఇరు దేశాల మధ్య దాదాపు ఏకాభిప్రాయం ఉంది. చైనాతో ఎదురయ్యే ముప్పును ఎదుర్కోవడంలో భారత్ కీలకం. కానీ ట్రంప్ కుటుంబంతో వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకునేందుకు పాక్ సుముఖత వ్యక్తం చేసింది. దీంతో, ఆయన భారత్‌తో స్నేహ బంధాన్ని కాదనుకున్నారు. భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలు అమెరికా ప్రయోజనాలకు ఎంతో ముఖ్యం. కానీ వీటిని కోల్పోవడం మనకు వ్యూహాత్మక ఎదురుదెబ్బ’ అని కామెంట్ చేశారు.

ట్రంప్ విదేశాంగ విధానాన్ని సులేవాన్ తప్పుబట్టారు. ఆయన తీరుతో అమెరికాకు మిత్ర దేశాలు దూరమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా పౌరుల దీర్ఘకాలిక ప్రయోజనాలకు ఇది దెబ్బ అని అన్నారు. భారత్‌తో దిగజారుతున్న సంబంధాల వల్ల ఇతర భాగస్వాములపై కూడా ప్రత్యక్ష, పరోక్ష ప్రభావం చూపుతోందని అన్నారు.

అమెరికా తీరుతో విసిగిపోతున్న భారత్ హుందాగా మౌనం పాటిస్తూనే జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. ఈ సమస్యను ఓ అవకాశంగా మలుచుకుంటోంది. ఇప్పటికే జీఎస్టీ సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైన విషయాన్ని విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. ఆత్మనిర్భర భారత్ లక్ష్యం దిశగా భారతీయులు స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాలని ప్రధాని మోదీ ఇటీవల పిలుపునిచ్చారు. ఇక భారత్‌పై ఏకంగా 50 శాతం సుంకం విధిస్తున్న అమెరికా పాక్‌పై మాత్రం కేవలం 19 శాతం సుంకం మాత్రమే విధించింది.

ఇవి కూడా చదవండి:

భారత్ ఇప్పటికే చాలా ఆలస్యం చేసింది: డొనాల్డ్ ట్రంప్

అమెరికా ద్రవ్యపరపతి విధానం ట్రంప్ చేతుల్లోకి వెళితే పెను ముప్పు: యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ చీఫ్ హెచ్చరిక

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 02 , 2025 | 11:16 AM