Share News

Christian Lagarde: అమెరికా ద్రవ్యపరపతి విధానం ట్రంప్ చేతుల్లోకి వెళితే పెను ముప్పు: యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ చీఫ్ హెచ్చరిక

ABN , Publish Date - Sep 01 , 2025 | 08:35 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేతుల్లోకి ఆ దేశ ద్రవ్యపరపతి విధానం వెళితే పెను ప్రమాదమని యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు చీఫ్ క్రిస్టీన్ లగార్డే హెచ్చరించారు. ఫెడరల్ రిజర్వ్ గవర్నర్ మార్పు కోసం ట్రంప్ ప్రయత్నిస్తున్నారన్న వార్తలపై ఆమె ఈ కామెంట్స్ చేశారు.

Christian Lagarde: అమెరికా ద్రవ్యపరపతి విధానం ట్రంప్ చేతుల్లోకి వెళితే పెను ముప్పు: యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ చీఫ్ హెచ్చరిక
Trump Fed Control Danger

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా ఫెడరల్ రిజర్వ్ పరిధిలోని ద్రవ్య పరపతి విధానం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేతుల్లోకి వెళితే ప్రపంచానికి పెను ముప్పు ఎదురవుతుందని యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు చీఫ్ క్రిస్టీన్ లగార్డే హెచ్చరించారు.

తన అభీష్టానికి అనుగుణంగా అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించాలని ట్రంప్ డిమాండ్ చేస్తున్నారు. ఈ దిశగా ఫెడరల్ రిజర్వ్ గవర్నర్ లీసా కుక్‌ను తప్పించి ఆమె స్థానంలో తన మద్దతుదారులను నియమించే ప్రయత్నంలో ఉన్నారని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ పరిణామాలపై మీడియా అడిగిన ప్రశ్నలపై క్రిస్టీన్ లగార్డే స్పందించారు.


ఫెడరల్ రిజర్వ్‌ అధికారుల్లో మెజారిటీ తనవైపు ఉండేలా నియామకాలు చేపట్టడం ట్రంప్‌కు చాలా కష్టంగా మారుతుందని వ్యాఖ్యానించారు. అయితే, ఈ ప్రయత్నంలో ట్రంప్ విజయం సాధిస్తే మాత్రం అమెరికాతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పెను ప్రమాదం ఎదురవుతుందని హెచ్చరించారు.

కేంద్ర బ్యాంకుల నిర్ణయాలు ధరలను, ఉద్యోగితను ప్రభావితం చేస్తాయని అన్నారు. ‘ఒక వ్యక్తి ఇష్టాయిష్టాలకు అనుగుణంగా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు ఉంటే అది అమెరికాతో పాటు ప్రపంచం ఆర్థిక వ్యవస్థపై ఆందోళనకర స్థాయిలో పెను ప్రభావం చూపుతుంది’ అని కామెంట్ చేశారు.


ఇవి కూడా చదవండి:

భారత్‌పై మీరూ ఆంక్షలు విధించండి.. ఐరోపా దేశాలకు అమెరికా సూచన

భారత పర్యటనను ట్రంప్ రద్దు చేసుకున్నారా.. న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనం

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 01 , 2025 | 08:43 PM