Trump-Quad Summit: భారత పర్యటనను ట్రంప్ రద్దు చేసుకున్నారా.. న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనం
ABN , Publish Date - Aug 31 , 2025 | 10:15 AM
క్వాడ్ సమావేశాల్లో పాల్గొనేందుకు భారత్ వస్తానని తొలుత చెప్పిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం ఆ ప్లాన్‌ను పక్కన పెట్టేసినట్టు తెలుస్తోంది. ఈ మేరకు న్యూయార్క్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా, భారత్ మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో న్యూయార్క్ టైమ్స్ ఇటీవల ప్రచురించిన కథనాలు మరింత సంచలనంగా మారాయి. భారత్‌లో పర్యటించాలన్న ప్లాన్‌ను ట్రంప్ తాజాగా పక్కనపెట్టేసినట్టు న్యూయార్క్ టైమ్స్ వార్తాపత్రిక తన కథనంలో పేర్కొంది. సెప్టెంబర్-డిసెంబర్ మధ్య కాలంలో క్వాడ్ సమావేశాల కోసం భారత్‌లో పర్యటిస్తానని ట్రంప్ గతంలో ప్రధాని మోదీకి చెప్పారట. ఆ తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ ప్లాన్స్‌ను పక్కన పెట్టేశారట. అయితే, ఈ విషయమై అటు అమెరికా, ఇటు భారత్ స్పందించలేదు.
త్వరలో భారత్ వేదికగా క్వా్డ్ కూటమి శిఖరాగ్ర సమావేశం జరగనుంది. ఇక ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజే అమెరికాలో క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది.
అమెరికా, భారత్ మధ్య వాణిజ్య ప్రతిష్టంభన నెలకొందని న్యూయార్క్ టైమ్స్ రాసుకొచ్చింది. డొనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోదీల సంబంధాలు కూడా తిరోగమనంలో ఉన్నాయని పేర్కొంది. భారత్, పాక్ మధ్య రాజీ కుదిర్చానన్న ట్రంప్ ప్రకటనతో వివాదం ముదిరిందని న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. ‘తనే రాజీ కుదుర్చానని ట్రంప్ పదే పదే చెప్పడం ప్రధాని నరేంద్ర మోదీకి కోపం తెప్పించింది. ట్రంప్ తీరుతో మోదీ సహనం నశిస్తోంది’ అని తెలిపింది.
ఇక కెనడాలో ఇటీవల జరిగిన జీ7 సమావేశాలకు అటు ట్రంప్ ఇటు ప్రధాని మోదీ ఇద్దరూ హాజరయ్యారు. ఆ సందర్భంగా ఇద్దరి మధ్య సమావేశం కూడా జరగాల్సి ఉంది. అయితే, ట్రంప్ అత్యవసరంగా అమెరికాకు వెనుదిరగాల్సి వచ్చింది. ఈ సందర్భంగా అధ్యక్షుడు ట్రంప్, ప్రధాని మోదీతో దాదాపు 35 నిమిషాల పాటు ఫోన్ కాల్‌లో మాట్లాడారట. ఈ సందర్భంగా భారత్-పాక్ మధ్య మూడో దేశం మధ్యవర్తిత్వం అంగీకరించబోమని ప్రధాని మోదీ స్పష్టం చేసినట్టు తెలిసింది. నోబెల్ ప్రైజ్‌కు పాక్ తనను నామినేట్ చేస్తున్న విషయాన్ని కూడా ట్రంప్ ఆ కాల్‌లో పేర్కొన్నారని, భారత్ కూడా ఇదే చేయాలన్న పరోక్ష సూచన చేశారని న్యూయార్క్ టైమ్స్ రాసుకొచ్చింది. ఈ కారణంగా ఇరు నేతల మధ్య ఎడం పెరిగినట్టు తెలిపింది. ఈ ఫోన్ కాల్‌కు సంబంధించి అమెరికా ఇంతవరకూ స్పందించలేదు.
ఇవి కూడా చదవండి:
భారత్‌పై మీరూ ఆంక్షలు విధించండి.. ఐరోపా దేశాలకు అమెరికా సూచన
అమెరికాకు అన్ని పోస్టల్ పార్శిళ్లు బంద్.. భారత్ నిర్ణయం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి