ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Brazil Tariff - Trump: భారీ షాకిచ్చిన ట్రంప్.. ఏకంగా 50 శాతం సుంకం...

ABN, Publish Date - Jul 10 , 2025 | 07:33 AM

బ్రెజిల్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ షాకిచ్చారు. ఆ దేశ ఉత్పత్తులపై ఏకంగా 50 శాతం సుంకాన్ని విధిస్తున్నట్టు ప్రకటించారు. ఆగస్టు 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని అన్నారు. మరో ఏడు దేశాలపై కూడా కొత్తగా ట్రంప్ సుంకాలను ప్రకటించారు.

50 Percent Tariff on Brazil

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా బ్రెజిల్‌కు భారీ షాకిచ్చారు. బ్రెజిల్ ఉత్పత్తులపై ఏకంగా 50 శాతం సుంకం విధిస్తున్నట్టు బుధవారం ప్రకటించారు. ఆగస్టు 1 నుంచి ఈ కొత్త సుంకం అమల్లోకి వస్తుందని అన్నారు. బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జెయిర్ బోల్సోనారో కేసు విషయంలో అక్కడి ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరిస్తుండటం, బ్రెజిల్‌తో అమెరికాకు ఉన్న అధిక వాణిజ్య లోటును కారణాలుగా పేర్కొన్నారు. 2022 నాటి ఎన్నికల్లో ఓటమి తరువాత అధికారం నిలబెట్టుకునేందుకు కుట్ర పన్నినట్టు బోల్సోనారో ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇక బ్రెజిల్‌తో పాటు మరో ఏడు దేశాలపై కూడా ట్రంప్‌ సుంకాలను భారీగా పెంచారు. శ్రీలంక, ఇరాక్, లిబియా, ఆల్జీరియాలపై 30 శాతం, బ్రూనై, మాల్డోవాపై 25 శాతం, ఫిలిప్పీన్స్‌పై 20 శాతం సుంకాన్ని విధించబోతున్నట్టు తన సొంత సోషల్ మీడియా ట్రూత్ సోషల్‌ ద్వారా వెల్లడించారు.

ఏప్రిల్‌లో ట్రంప్ ప్రభుత్వం బ్రెజిల్‌పై 10 శాతం సుంకం విధించింది. తాజాగా ట్రంప్ ఈ సుంకాన్ని అమాంతం 50 శాతానికి పెంచేశారు. అంతకుమునుపు ట్రంప్ దక్షిణ కొరియా, జపాన్‌ ఉత్పత్తులపై 25 శాతం సుంకం విధిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ సుంకం గతంలోనే విధించి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. తూర్పు ఆసియా దేశాలతో అమెరికా వాణిజ్య లోటు పూడ్చుకునేందుకు తాజా సుంకాలు కూడా తక్కువేనని అభిప్రాయపడ్డారు.

జపాన్, దక్షిణ కొరియా తరువాత ట్రంప్ మరో 12 దేశాలను టార్గెట్ చేశారు. మియాన్మార్, లావోస్, దక్షిణాఫ్రికా, కజఖస్థాన్, మలేషియా, ట్యూనీషియా, ఇండోనేషియా, బోస్నియా అండ్ హెర్జగోవినా, బంగ్లాదేశ్, సెర్బియా, కాంబోడియా, థాయ్‌లాండ్‌‌లకు సుంకాల షాకిచ్చారు. ఆయా దేశాలతో అమెరికాకు ఏళ్ల తరబడి ఉన్న వాణిజ్య లోటును సరిదిద్దేందుకు ఈ సుంకాలు తప్పట్లేదని చెప్పుకొచ్చారు. ప్రపంచంతో న్యాయమైన, సమతౌల్యత కలిగిన వాణిజ్యానికి అమెరికా ఎప్పుడూ సిద్ధమేనని అన్నారు. అవసరమైతే సుంకాలను మరింత పెంచుతామని కూడా హెచ్చరించారు.

ఇక బ్రెజిల్, రష్యా, భారత్, చైనాలతో కూడిన బ్రిక్స్ కూటమిని కూడా టార్గెట్ చేసిన ట్రంప్.. అమెరికా కరెన్సీని బలహీనపరిచే చర్యలను అస్సలు సహించబోమని అన్నారు. హద్దు మీరితే ఈ దేశాలపై అదనంగా 10 శాతం సుంకాన్ని విధిస్తామని వార్నింగ్ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి:

మోదీకి నమీబియా అత్యున్నత పౌర పురస్కారం

కార్గో నౌకపై హూతీ దాడి.. టైటానిక్‌లా మునిగిన నౌక.. వీడియో వైరల్..!

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 10 , 2025 | 12:09 PM