Israel Parliament protest: చాలా బాగా చేశారు.. నిరసనకారుడిని వెళ్లగొట్టడంపై ట్రంప్ చమత్కారం..
ABN, Publish Date - Oct 13 , 2025 | 06:10 PM
రెండేళ్లుగా ఉద్రిక్తతలు రేపుతున్న గాజా యుద్ధం ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్‌లో పర్యటిస్తున్నారు. రెండేళ్లుగా తమ చెరలో బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరులను హమాస్ తాజాగా విడుదల చేసింది.
రెండేళ్లుగా ఉద్రిక్తతలు రేపుతున్న గాజా యుద్ధం ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్‌లో పర్యటిస్తున్నారు. రెండేళ్లుగా తమ చెరలో బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరులను హమాస్ తాజాగా విడుదల చేసింది. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో ట్రంప్ ప్రసంగించారు. ఈ సందర్భంగా కాల్పుల విరమణకు అంగీకరించిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహును అభినందించారు (Trump Israel visit).
ఇజ్రాయెల్‌కు అమెరికా ఎప్పుడూ తోడుగా ఉంటుందని హామీనిచ్చారు. గాజా శాంతి ఒప్పందంలో కీలకపాత్ర పోషించిన అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, తన అల్లుడు, సలహాదారుడు అయిన జేర్డ్ కుష్నర్‌ను అభినందించారు. ఈ సమయంలో ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో కాస్త గందరగోళం నెలకొంది. ట్రంప్ మాట్లాడుతున్న సమయంలో పాలస్తీనా-ఇజ్రాయెల్ జాయింట్ పొలిటికల్ పార్టీకి చెందిన ఎంపీ ఫ్లకార్డు ప్రదర్శించారు. 'పాలస్తీనాను గుర్తించాలి' అంటూ నినాదాలు చేశారు (Israel Parliament protest).
ట్రంప్ మాట్లాడుతున్న సమయంలో నిరసనలు వ్యక్తం చేసిన వారిని పార్లమెంట్ నుంచి బయటకు పంపించివేశారు (Trump reaction protest). ఆ సమయంలో ట్రంప్ జరుగుతున్న ఘటనలను చూస్తూ ఉండిపోయారు. ఆ తర్వాత ఘటనపై ట్రంప్‌నకు స్పీకర్ క్షమాపణలు చెప్పారు. దీనికి స్పందించిన ట్రంప్.. 'చాలా సమర్థవంతంగా పని చేశారు' అని చమత్కరించారు. దాంతో అక్కడున్న అందరూ చిరునవ్వులు చిందించారు.
ఇవి కూడా చదవండి:
నోబెల్ శాంతి బహుమతి సమాచారం లీక్
58 మంది పాక్ సైనికులను చంపాం: అప్ఘాన్ మంత్రి
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Oct 13 , 2025 | 06:47 PM