Shehbaz Sharif: బ్రహ్మోస్‌తో పాక్‌పై దాడులు.. కీలక విషయాలు వెల్లడించిన ప్రధాని షరీఫ్
ABN, Publish Date - May 29 , 2025 | 07:09 PM
Shehbaz Sharif: భారత్‌పై పాక్ ఆర్మీ దాడి చేయడానికి అంతా సిద్ధం చేసుకుందని, ఈలోపే భారత్ బ్రహ్మోస్ మిస్సైల్స్‌తో దాడి చేసిందని ప్రధాని షరీఫ్ తెలిపారు. కీలక మిలటరీ బేస్‌లతోపాటు ఎయిర్‌పోర్టుపై దాడి చేసిందన్నారు.
భారత్, పాకిస్థాన్‌ల మధ్య జరిగిన యుద్ధంలో ఇండియన్ ఆర్మీ ధైర్య సాహసాలు, తిరుగులేని వ్యూహాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇండియన్ ఆర్మీ మిస్సైల్స్ దాడులపై తాజాగా పాకిస్థాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ తమను ఊహించని దెబ్బ కొట్టిందని అన్నారు. మే 10వ తేదీన భారత్‌పై తమ ఆర్మీ దాడి చేయడానికి అంతా సిద్ధం చేసుకుందని, ఈలోపే భారత్ బ్రహ్మోస్ మిస్సైల్స్‌తో దాడి చేసిందని తెలిపారు. కీలక మిలటరీ బేస్‌లతోపాటు ఎయిర్‌పోర్టుపై దాడి చేసిందన్నారు. పాకిస్థాన్ మిత్ర దేశం అజర్‌బైజాన్‌లో పర్యటిస్తున్న షహబాజ్ షరీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
అజర్‌బైజాన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో షరీఫ్ మాట్లాడుతూ.. ‘ మే 10వ తేదీన ఇండియాపై దాడులు చేయడానికి ప్లాన్ చేశాం. పాకిస్థాన్ ఆర్మీ దాడులు చేయడానికి అంతా సిద్ధం చేసుకుంది. ప్రార్థనలు పూర్తయిన తర్వాత .. తెల్లవారుజామున 4.30 గంటలకు దాడి చేద్దామని అనుకున్నాం. పాకిస్థాన్ దాడి చేయడానికి ముందే ఇండియా దాడులు మొదలుపెట్టింది. పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో లాంగ్ రేంజ్ సూపర్ సోనిక్ బ్రహ్మోస్ క్రూయిస్ మిస్సైల్స్‌తో దాడులు చేసింది. రావల్‌పిండిలోని ఎయిర్‌పోర్టుపైనా దాడి చేసింది’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
పాకిస్తాన్ టూర్.. బయ్యా సన్నీ యాదవ్‌ను అరెస్ట్ చేసిన ఎన్ఐఏ
ముగ్గురు భార్యల ముద్దుల మొగుడు.. మూడు ఫ్యామిలీలను పోషించలేక..
Updated Date - May 29 , 2025 | 07:25 PM