ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Putin: ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధం

ABN, Publish Date - Apr 22 , 2025 | 02:55 AM

ఉక్రెయిన్‌తో శాంతి చర్చలకు తాను సిద్ధమని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రకటించారు. ఈస్టర్‌ సందర్భంగా కాల్పుల విరమణతో పాటు, మరిన్ని చర్చలకూ తాము సిద్ధమని తెలిపారు

మాస్కో, ఏప్రిల్‌ 21: ఉక్రెయిన్‌తో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రకటించారు. ఉక్రెయిన్‌లో శాంతి నెలకొల్పేందుకు సహకరించాలంటూ అమెరికా.. రష్యాపై ఒత్తిడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌తో చర్చలు జరిపేందుకు తాను సిద్ధమని సోమవారం పుతిన్‌ చెప్పారు. అనేక సంవత్సరాల తర్వాత ఆయన ఇలాంటి ప్రకటన చేయడం ఇదే తొలిసారి. ఇక ఈస్టర్‌ సందర్భంగా రష్యా ఒక రోజు కాల్పుల విరమణను పాటించిన సంగతి తెలిసిందే. ఇలాంటి కాల్పుల విరమణలు మరిన్ని పాటిచేందుకు కూడా సిద్ధమని పుతిన్‌ పేర్కొన్నారు. శాంతి స్థాపనకు రష్యా ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని, ఉక్రెయిన్‌ నుంచి కూడా అదే ఆశిస్తున్నామని తెలిపారు. పుతిన్‌ వ్యాఖ్యలపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఇంకా స్పందించలేదు.

Updated Date - Apr 22 , 2025 | 02:55 AM