ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Emmanuel Macron: కొకైన్‌తో దేశ అధ్యక్షుడు.. మీటింగ్‌లో అడ్డంగా బుక్కయ్యాడు..

ABN, Publish Date - May 12 , 2025 | 10:31 AM

President Emmanuel Macron: ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆయన డ్రగ్స్ ప్యాకెట్లతో దొరికిపోయారంటూ ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారంపై ఫ్రెంచ్ మీడియా ఔట్‌లెట్ లిబరేషన్ స్పందించింది.

President Emmanuel Macron

మాదక ద్రవ్యాలు( డ్రగ్స్) వాడకం వల్ల ఓ మనిషి జీవితం ఎంతలా నాశనం అవుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. డ్రగ్స్‌కు బానిస అయిన వారు విచక్షణ మరిచిపోతారు. అందుకే ప్రపంచంలోని చాలా దేశాలు డ్రగ్స్ వాడకాన్ని పూర్తిగా నిషేదించాయి. డ్రగ్స్ తీసుకునే వారిపై చర్యలు తీసుకుంటున్నాయి. డ్రగ్స్ తీసుకోవటం మంచిది కాదు.. వాటికి దూరంగా ఉండాలని చెప్పాల్సిన దేశ అధ్యక్షుడు తప్పుదోవ పట్టాడన్న టాక్ నడుస్తోంది. ఆ పెద్ద మనిషి ఎవరో కాదు.. ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్.


ఇమ్మాన్యుయేల్ ప్రస్తుతం ఉక్రెయిన్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా పోలాండ్ నుంచి ఉక్రెయిన్ వరకు రైలులో ప్రయాణించారు. రైలులో యూకే ప్రధాని కైర్ స్టామర్, కౌన్సిలర్ ఆఫ్ జనరల్ ఫ్రెడ్రిచ్ మెర్జ్‌తో మీటింగ్లో ఉండగా.. మీడియా ప్రతినిధులు అక్కడికి వెళ్లారు. అక్కడ ఫొటోలు, వీడియోలు తీశారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోనే ఇమ్మాన్యుయేల్ కొంప ముంచింది. ఆ వీడియోలో ఏ ముందంటే..


ఇమ్మాన్యుయేల్ ఇతర నాయకులతో కలిసి కుర్చీల్లో కూర్చున్నాడు. ఆ వెంటనే ఫైల్స్ పక్కన ఉన్న ఓ చిన్న కవర్‌ను ఠక్కున చేతిలోకి తీసుకున్నాడు. దాన్ని ఎవరికీ కనిపించకుండా జాగ్రత్తపడ్డారు. ఇక, సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. ఇమ్మాన్యుయేల్ దాచి పెట్టింది కొకైన్ పొట్లం అన్న ప్రచారం జరుగుతోంది. అయితే, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఫ్రెంచ్ మీడియా ఔట్‌లెట్ లిబరేషన్ ఇమ్మాన్యుయేల్‌కు మద్దతుగా నిలిచింది. సోషల్ మీడియా ప్రచారం నిజం అనడానికి ఎలాంటి ఆధారం లేదని అంది. ఆయన ఠక్కున చేతుల్లోకి తీసుకుని దాచుకున్నది కర్చీఫ్ అని అంటోంది. అది కొకైన్ అనుకోవటం కుట్రపూరితం అని పేర్కొంది.


ఇవి కూడా చదవండి

Hero Vishal: విశాల్‌కు అస్వస్థత.. స్టేజిపై స్ప్రహతప్పిన హీరో

Viral Video: శుభమా అని పెళ్లి చేసుకోబోతూ ఇదేం పని..

Updated Date - May 12 , 2025 | 10:43 AM