PM Modi Trump call: థాంక్యూ ట్రంప్.. దివాళీ ఫోన్ కాల్‌కు ప్రధాని మోదీ స్పందన..
ABN, Publish Date - Oct 22 , 2025 | 10:36 AM
ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ధన్యావాదాలు తెలియజేశారు. ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామిక దేశాలు కలిసి నడవాలని, తీవ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఎక్స్ ద్వారా మోదీ ట్వీట్ చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ధన్యావాదాలు తెలియజేశారు. ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామిక దేశాలు కలిసి నడవాలని, తీవ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఎక్స్ ద్వారా మోదీ ట్వీట్ చేశారు. భారత ప్రజలకు, ప్రవాస భారతీయులకు ట్రంప్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. భారత ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు. దీపావళి పండుగ గొప్పతనం గురించి వివరించారు (PM Modi Trump call).
ట్రంప్ శుభాకాంక్షల నేపథ్యంలో ఎక్స్ ద్వారా ప్రధాని మోదీ స్పందించారు. 'మీ ఫోన్ కాల్‌కు, దీపావళి శుభాకాంక్షలు తెలిపినందుకు ధన్యవాదాలు ప్రెసిడెంట్ ట్రంప్. ఈ వెలుగుల పండుగ నాడు, మన రెండు గొప్ప ప్రజాస్వామ్య దేశాలు ప్రపంచాన్ని ఆశతో ప్రకాశింపజేయడాన్ని కొనసాగించాలి. ఇరు దేశాలు అన్ని రకాల ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా నిలబడాలి' అని మోదీ ట్వీట్ చేశారు (Diwali phone call Modi Trump).
అంతకు ముందు వైట్‌హౌస్‌లో జరిగిన కార్యక్రమంలో ట్రంప్ దీపావళిని సెలబ్రేట్ చేశారు (Modi Trump relations). 'భారత ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ రోజు నేను మీ ప్రధాని మోదీతో ఫోన్‌లో మాట్లాడాను. మా మధ్య వాణిజ్య సంబంధాలపై గొప్ప సంభాషణ జరిగింది. పాకిస్థాన్‌తో యుద్ధం వద్దనే అంశం కూడా మా మధ్య చర్చకు వచ్చింది. వాణిజ్యంతో పాటు యుద్ధం లేకుండా చూడటం చాలా మంచి విషయం' అని ట్రంప్ పేర్కొన్నారు. అలాగే ప్రధాని మోదీ తనకు గొప్ప మిత్రుడని, ఆయన గొప్ప వ్యక్తి అని మరోసారి ట్రంప్ ప్రశంసించారు.
ఇవి కూడా చదవండి..
భారీగా పతనమైన బంగారం ధర.. హైదరాబాద్‌లో ఎంతంటే..
వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు.. ప్రధాని మోదీ గురించి ట్రంప్ ఏమన్నారంటే..
మరిన్ని తాజా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Oct 22 , 2025 | 10:37 AM