Gold Prices Fall: భారీగా తగ్గిన బంగారం ధర.. ఒక్క రోజులోనే ఆరు వేలు డ్రాప్..
ABN , Publish Date - Oct 22 , 2025 | 10:12 AM
పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్. రోజూ పెరుగుతూ సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్న బంగారం బుధవారం భారీ తగ్గుదలను నమోదు చేసింది.
పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్. రోజూ పెరుగుతూ సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్న బంగారం బుధవారం భారీ తగ్గుదలను నమోదు చేసింది. ఒక్క రోజులోనే ఆరు వేల రూపాయలు తగ్గింది. హైదరాబాద్‌లో బులియన్ మార్కెట్‌లో 24 క్యారెటర్ల పది గ్రాముల బంగారం ధర బుధవారం ఉదయం రూ.1, 27, 200కు చేరింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1, 16, 600కి చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో మంగళవారం ఔన్స్ (31.10 గ్రాములు) ధర తగ్గడం వల్లే బంగారం ధరల తగ్గుదలకు కారణంగా కనిపిస్తోంది. ఔన్స్ 24 క్యారెట్ల బంగారం ధరం ఏకంగా 245 డాలర్లు క్షీణించింది. 4097 డాలర్లకు దిగి వచ్చింది. మరోవైపు వెండి కూడా ఔన్స్ ధర 3.9 డాలర్లు తగ్గి 48.39 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో వెండి ధరలు కిలోకు దాదాపు రూ.2 వేలు తగ్గి రూ.1.80 లక్షలకు చేరుకున్నాయి.
2013 తర్వాత ఈ రెండు లోహాలు ఒక్క రోజులో ఇంత భారీగా పతనం కావడం ఇదే తొలిసారి. ఈ రెండు లోహాలు గరిష్టాలకు చేరువు కావడం, అంతర్జాతీయంగా డాలర్ తిరిగి బలోపేతం కావడం, పలు దేశాల మధ్య ఉద్రిక్తతలు చల్లబడడం అంతర్జాతీయ విపణిలో బంగారం ధర పతనానికి కారణాలుగా కనిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి..
స్వల్ప తగ్గుదల.. మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు.. ప్రధాని మోదీ గురించి ట్రంప్ ఏమన్నారంటే..
మరిన్ని తాజా వార్తలు కోసం క్లిక్ చేయండి..