London plane crash: గాల్లోకి ఎగిరిన కాసేపటికే కుప్పకూలిన విమానం
ABN, Publish Date - Jul 15 , 2025 | 04:23 AM
లండన్ నుంచి నెదర్లాండ్స్‌లోని లెలిస్టాడ్‌కు బయల్దేరిన చిన్నపాటి విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కూలిపోయింది.
లండన్‌లో ఘటన.. నలుగురి మృతి
లండన్, జూలై 14: లండన్ నుంచి నెదర్లాండ్స్‌లోని లెలిస్టాడ్‌కు బయల్దేరిన చిన్నపాటి విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న నలుగురు మృతి చెందారు. నెదర్లాండ్స్‌లోని జ్యూష్ ఏవియేషన్‌కు చెందిన బీచ్‌క్రాఫ్ట్ బీ200 సూపర్ కింగ్ విమానం లండన్‌కు తూర్పున 56కి.మీ దూరంలో ఉన్న సౌత్‌ఎండ్ విమానాశ్రయం నుంచి ఆదివారం మధ్యా హ్నం గాల్లోకి ఎగిరిన కొన్ని సెకన్లకే కుప్పకూలింది.
Updated Date - Jul 15 , 2025 | 04:23 AM