ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Earthquake: టిబెట్‌లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.7 తీవ్రత

ABN, Publish Date - May 12 , 2025 | 07:22 AM

Earthquake: టిబెట్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 5.7గా నమోదు అయింది. ఎన్‌సీఎస్ తెలిపిన వివరాల ప్రకారం.. భూకంపం 10 కిలోమీటర్ల లోతులో సంభవించిందని, దీనివల్ల భూకంపం తర్వాత ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పోస్టు చేసింది.

Earthquake in Tibet

Earthquake: టిబెట్‌ (Tibet)లో భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టర్‌ స్కేలు (Richter Scale)పై భూకంప తీవ్రత 5.7గా నమోదు అయింది. సోమవారం తెల్లవారుజాము 2.41 గంటలకు ఈ భూకంపం సంభవించింది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం లేదని అక్కడి అధికారులు వెల్లడించారు. అర్ధరాత్రి 2.41 గంటల సమయంలో భూకంపం వచ్చినట్లు జాతీయ భూకంప పరిశోధనా కేంద్రం (NCS) (National Seismological Center) వెల్లడించింది. దేశవ్యాప్తంగా ప్రకంపనలు వచ్చినట్లు పేర్కొంది. మూడు రోజుల కిందట కూడా టిబెట్‌లో భూకంపం వచ్చింది. అయితే, అది రిక్టర్‌ స్కేల్‌పై 3.7గా నమోదైంది.


ఎన్‌సీఎస్ తెలిపిన వివరాల ప్రకారం.. భూకంపం 10 కిలోమీటర్ల లోతులో సంభవించిందని, దీనివల్ల భూకంపం తర్వాత ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పోస్టు చేసింది. కాగా మే 8న భూకంపం వచ్చిందని, అది 3.7 తీవ్రతతో ఈ ప్రాంతాన్ని కుదిపేసిందని పేర్కొంది. ఇలాంటి భూకంపాలు భూమి ఉపరితలానికి దగ్గరగా ఎక్కువ శక్తిని విడుదల చేయడం వల్ల లోతైన భూకంపాల కంటే ప్రమాదకరమైనవని, ఇది బలమైన భూప్రకంపనలకు భవన నిర్మాణాలు కూలిపోయి.. ప్రాణ నష్టాన్ని కలిగిస్తుందని ఎన్‌సీఎస్ తెలిపింది.

Also Read:

ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: 13మంది మృతి


కాగా ఇటీవ‌ల కాలంలో భూకంపాలు ప్ర‌జ‌ల‌కు తీవ్ర ఆందోళ‌నలు క‌లిగిస్తున్నాయి. త‌ర‌చూ ఏదో ఒక దేశంలో భూకంపం సంభవిస్తోంది. ఇటీవ‌లే థాయిలాండ్‌లో సంభ‌వించిన భూకంపం వల్ల తీవ్ర ఆస్తి, ప్రాణ‌న‌ష్టం క‌లిగింది. కొద్ది రోజుల క్రిత‌మే భార‌త్, పాకిస్థాన్‌లలో భూమి స్వ‌ల్పంగా కంపించింది. అయితే ఎలాంటి ప్రాణ ఆస్తి న‌ష్టం జ‌ర‌గ‌లేదు. తాజాగా టిబెట్‌లో భూకంపం సంభవించింది. అయితే ఇప్పటి వరకు ప్రాణ నష్టం జరగలేదని తెలియవచ్చింది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

అది బ్రహ్మాస్త్రమే..

అమెరికా ఒత్తిడికి ఇందిర తలొగ్గని వేళ..

For More AP News and Telugu News

Updated Date - May 12 , 2025 | 07:22 AM