Sher Afzal Khan Marwat: భారత్‌తో యుద్ధం మొదలైతే నేను ఇంగ్లండ్ వెళ్లిపోతా.. పాక్ సీనియర్ నేత
ABN, Publish Date - May 04 , 2025 | 09:59 AM
భారత్‌తో యుద్ధం వస్తే తాను దేశం విడిచిపోతానంటూ పాక్ జాతీయ అసెంబ్లీ సభ్యుడు షేర్ అఫ్జల్ మార్వాత్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.
ఇంటర్నె్ట్ డెస్క్: మేమేమీ గాజులు తొడుక్కుని కూర్చోలేదు.. మా వద్ద ఆయుధాలు ఉన్నది ప్రదర్శించడానికి కాదు.. అణ్వాయుధాలను భారత్ వైపు గురిపెట్టి ఉంచాం.. సింధూ నదిలో రక్తం పారుతుంది.. ఇవి ఇటీవల వినబడ్డ పాక్ నేతల ప్రగల్భాలు. అయితే, లోలోపలు పాక్ నేతలు భారత్‌తో యుద్ధం విషయంలో వణికిపోతున్నారనేందుకు రుజువుగా ఓ పాక్ సీనియర్ నేత కీలక వ్యాఖ్యలు చేశారు.
పాక్ జాతీయ అసెంబ్లీ సభ్యుడు షేర్ అఫ్జల్ ఖాన్ మార్వాత్ భారత్‌తో యుద్ధంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఒక వేళ యుద్ధం గనుక జరిగితే నేను ఇంగ్లండ్‌కు వెళ్లిపోతా’’ అని తడుముకోకుండా చెప్పారు. భారత్‌తో యుద్ధం మొదలైతే ఏం చేస్తారన్న రిపోర్టర్ ప్రశ్నకు ఆయన ఈ మేరకు జవాబిచ్చారు.
యుద్ధం విషయంలో మోదీ ఆచితూచి వ్యవహరించాలని మీరు ఆశిస్తున్నారా అని రిపోర్టర్ అడగ్గా మార్వాత్ తనదైన శైలిలో స్పందించారు. ‘‘నేను చెప్పానని వెనక్కు తగ్గడానికి మోదీ ఏమీ నా బంధువు కాదుకదా..’’ అని అన్నారు. దీంతో, ఈ ఉదంతం నెట్టింట సంచలనంగా మారింది. పాక్ ఆర్మీని అక్కడి నాయకులే నమ్మట్లేదంటూ జనాలు ట్రోల్ చేస్తున్నారు.
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పీటీఐ పార్టీలో సీనియర్ నేతగా ఉన్న మార్వాత్ గతంలో సొంతపార్టీపైనే విమర్శలు ఎక్కుపెట్టి ఇమ్రాన్ ఆగ్రహానికి గురయ్యారు. ఆయనను ఇమ్రాన్ ఖాన్ పార్టీ కీలక స్థానాల నుంచి తప్పించారు.
పహల్గాం దాడి తరువాత పాక్ కవ్వింపు చర్యలు ఎక్కువయ్యాయి. వాస్తవాధీన రేఖ వెంబడి కాల్పులకు తెగబడుతోంది. కుప్వారా, బారాముల్లా, పూంఛ్, రాజౌరీ, మేంధర్, నౌషీరా, సుందర్‌బనీ, అఖ్నూర్ ఏరియాలో వరుసగా పదో రోజూ పాక్ ఆర్మీ కాల్పుల ఉల్లంఘనకు దిగింది. ఈ దుందుడుకు చర్యలకు భారత్ ఆర్మీ దీటుగా జవాబిచ్చింది.
ఇక దౌత్యపరంగా పాక్‌పై ఒత్తిడి పెంచేందుకు భారత్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవలే పాక్ దిగుమతులపై నిషేధం విధించింది. భారతీయ పోర్టుల్లో పాక్ నౌకలు ఆగొద్దని కూడా ఆదేశాలు జారీ చేసింది. పాక్ నుంచి వచ్చే ఉత్తరాలు, పార్సిల్స్‌ను కూడా నిషేధించింది. ఇక సింధూ నదీ జలాల పంపిణీ ఒప్పందం నిలిపివేతతో పాక్ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్న విషయం తెలిసిందే. యుద్ధభయాలు కూడా అక్కడి నేతలను వెంటాడుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
భారత్, పాక్ సైన్యాల శక్తిసామర్థ్యాలు ఇవీ..
ఉద్రిక్తతలు తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి.. భారత్, పాక్‌లకు అమెరికా పిలుపు
పహల్గాం దాడిలో పాల్గొన్న ఉగ్రవాది ఓ మాజీ పాక్ పారా కమాండో!
మరిన్ని ఉగ్రదాడులకు ఛాన్స్.. కశ్మీర్‌లో పలు పర్యాటక స్థలాల మూసివేత
Read More Latest Telugu News and International News
Updated Date - May 04 , 2025 | 10:28 AM