Share News

India vs Pakistan Military Strength: భారత్, పాక్ సైన్యాల శక్తిసామర్థ్యాలు ఇవీ..

ABN , Publish Date - May 01 , 2025 | 08:27 AM

సైనిక సామర్థ్యల పరంగా భారత్ పాక్ కంటే ముందంజలో ఉందని నిపుణులు చెబుతున్నారు. మరి ఇరు దేశాల సైనిక సిబ్బంది, ఆయుధాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.

India vs Pakistan Military Strength: భారత్, పాక్ సైన్యాల శక్తిసామర్థ్యాలు ఇవీ..

ఇంటర్నెట్ డెస్క్: పహల్గాం దాడి తరువాత భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. భారత్ సైనిక దాడి చేస్తుందని పాక్ భయపడిపోతోంది. భయాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రగల్భాలు పలుకుతోంది. వాస్తవాధీన రేఖ వెంబడి కాల్పుల ఉల్లంఘనలకు కూడా దిగుతోంది. ఈ నేపథ్యంలో అసలు ఇరు దేశాల సైనిక సామర్థ్యాలు ఏంటో ఈ కథనంలో పరిశీలిద్దాం.

స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ లెక్కల ప్రకారం, భారత మిలిటరీ సిబ్బంది సంఖ్య 14.75 లక్షలు. వీరితో పాటు మన దేశానికి మరో 16.16 మంది పారామిలిటరీ పోలీసు బలగాలు కూడా ఉన్నాయి.

భారత మిలిటరీ విమానాల సంఖ్య 1437 కాగా, 995 హెలికాఫ్టర్లు, 7074 ఆర్మర్డ్ ఫైటింగ్ వెహికిల్స్ ఉన్నాయి. 11,225 ఆర్టిలరీ ఆయుధ సామగ్రి కూడా ఉన్నాయి. భూఉపరితలంతో పాటు గగనతలం నుంచి అణ్వాయుధాలను ప్రయోగించే సామర్థ్యం భారత్‌కు ఉంది. జలాంతర్గాముల నుంచి అణ్వాయుధాల ప్రయోగ సామర్థ్యాలను అభివృద్ధి చేసుకునేందుకు కూడా ప్రయోగిస్తోంది. భారతకు మధ్య శ్రేణి క్షిపణులు అనేకం ఉన్నాయి. విస్తృత శ్రేణి ఖండాంతర క్షిపణుల అభివృద్ధికి కూడా భారత్ కసరత్తు చేస్తోంది. ఈ ఏడాది భారత్ రక్షణ రంగంపై 81 బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టేందుకు నిర్ణయించింది.


భారత్‌తో పోలిస్తే పాక్ రక్షణ రంగ కేటాయింపులు స్వల్పం. ఈ ఏడాది పాక్ రక్షణ రంగానికి 10 బిలియన్ డాలర్లు కేటాయించింది. పాక్‌ సైనిక సిబ్బంది సంఖ్య 6.6 లక్షలు. భారత్‌తో పోలిస్తే సైనిక సిబ్బంది దాదాపు 50 శాతం తక్కువ. ఇక దాయాది దేశంలో పారామిలిటరీ పోలీసుల సంఖ్య 2.91 లక్షలు.

పాక్ వద్ద 812 సైనిక విమానాలు, 322 మిలిటరీ హెలికాఫ్టర్లు, 6137 ఆర్మర్డ్ వెహికిల్స్, 4619 ఆర్టిలరీ ఆయుధాలు ఉన్నాయి. ఆర్మర్డ్ వెహికిల్స్‌ సంఖ్యలో పాక్‌ భారత్‌ దాదాపుగా సరిసమానమని నిపుణులు చెబుతుంటారు. భారత్ వలెనే పాక్ కూడా భూఉపరితలం లేదా గగనతలం నుంచి అణ్వాయుధాలను ప్రయోగించగలదు. పాక్ వద్ద మధ్యస్రేణి, స్వల్ప శ్రేణి క్షిపణులు కడా ఉన్నాయి. జలాంతర్గాముల నుంచి ప్రయోగించే అణ్వాయుధాల కోసం పాక్ ప్రయత్నిస్తోంది.


వివిధ దేశాల సైనిక సామర్థ్యాన్ని ముదింపు వేసే గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ ప్రకారం, భారత సైనిక సామర్థ్యం పాక్ కంటే చాలా మెరుగు. జీఎఫ్‌పీ సూచీ స్కోరు 0.1184తో భారత్ సైనిక శక్తి పరంగా ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉంది. 0.2513 స్కోరు ఉన్న పాక్ 12వ స్థానంలో ఉంది. భారత్ తన ఆయుధ సంపత్తిని ప్రధానంగా రష్యా నుంచి సేకరిస్తుంది.అయితే, ఇటీవల కాలంలో అమెరికా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ నుంచి కూడా అత్యాధునిక ఆయుధాలను సమకూర్చుకుంటోంది.

ఇవి కూడా చదవండి:

ఉద్రిక్తతలు తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి.. భారత్, పాక్‌లకు అమెరికా పిలుపు

పహల్గాం దాడిలో పాల్గొన్న ఉగ్రవాది ఓ మాజీ పాక్ పారా కమాండో!

మరిన్ని ఉగ్రదాడులకు ఛాన్స్.. కశ్మీర్‌లో పలు పర్యాటక స్థలాల మూసివేత

Read More Latest Telugu News and International News

Updated Date - May 01 , 2025 | 08:27 AM