Pakistani Journalists Clash: పబ్లిక్‌గా ఒకరినొకరు తిట్టుకున్న పాక్ జర్నలిస్టులు
ABN, Publish Date - May 04 , 2025 | 11:38 AM
లండన్‌లో పబ్లిక్‌గా పాకిస్థానీ జర్నలిస్టులు పరస్పర దూషించుకున్న ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: లండన్‌లో ఇద్దరు పాకిస్థానీ జర్నలిస్టులు అందరూ చూస్తుండగా ఒకరినొకరు తిట్టుకున్న ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం కలిగిస్తోంది. రాయడానికి వీలులేని పదజాలంతో సఫీనా ఖాన్, అసద్ మలిక్‌ను ఒకరినొకరు తిట్టిపోసుకున్నారు. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సహాయకుడు, పీటీఐ నేత సల్మాన్ అక్రమ్ రజా ఏర్పాటు చేసిన ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది.
పాకిస్థానీ న్యూస్ ఛానెల్ నియో న్యూస్‌కు చెందిన జర్నలిస్టు సఫీనా ఖాన్ లండన్‌లో ఉంటారు. అయితే, అసద్ మలిక్‌తో పాటు ఏఆర్‌వై న్యూస్, హమ్ న్యూస్‌కు చెందిన పలువురు జర్నలిస్టులు తనకు వ్యతిరేకంగా ముఠా కట్టి వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు. తనను చంపుతామని కూడా బెదిరించారని వాపోయారు. ‘‘సల్మాన్ రజా ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా మోహ్సీన్ నఖ్వీ, అసద్ మలిక, ఏఆర్‌వై రిపోర్టరు ఫరీద్, హమ్ న్యూస్ రిపోర్టరు రఫీక్ నన్ను వేధించారు. నన్ను చంపుతామని కూడా బెదిరించారు’’ అని సఫీనా ఆరోపించారు.
అసద్ మలిక్ మాత్రం ఈ ఆరోపణలను కొట్టి పారేశారు. అసద్ యూకేకు చెందిన ఓ వార్తా సంస్థలో పనిచేస్తారు. ‘‘ఇవన్నీ తప్పుడు, నిరాధార ఆరోపణలు. వాస్తవాలు స్పష్టంగా ఉన్నాయి. అసలేం జరిగిందో ప్రత్యక్ష సాక్షులకు తెలుసు. తాము ఏమీ అనకపోయినా కూడా సఫీనా అసభ్యపదజాలంతో తమను దూషించింది’’ అని చెప్పుకొచ్చాడు.
అయితే, అసద్‌తో పాటు మిగతా వారు గతంలోనూ తనను బెదిరించారని, తాను ఫిర్యాదు చేసినా నిరుపయోగంగా మారిందని తెలిపారు. లండన్ పోలీసులను ట్యాగ్ చేస్తూ ఓ పోస్టు కూడా పెట్టారు. తనకేమైనా జరిగితే అందుకు ఆ రిపోర్టర్లే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కాగా, సఫీనా అసభ్య పదాలు వాడుతున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై ఆమె వివరణ కూడా ఇచ్చారు.
‘‘ఓ పురుషుడు అందరిముందూ నన్ను, నా తల్లిని దూషిస్తే నేను ఇంతకు రెండింతలు అతడిని తిడతాను. అవతలి వ్యక్తి ఎంతగా అరిచి గోల చేస్తే శిక్ష అంత పెద్దది అవుతుందని అన్నారు. ట్విట్టర్‌లో వైరల్ అవుతున్న ఓ వీడియోను కూడా పంచుకున్న ఆమె పంచుకున్నారు. తనదే తప్పన్నట్టు చూపిస్తున్న ఈ వీడియోను మార్పులు చేశాక నెట్టింట ఎవరో పంచుకున్నారని, దీని వెనక పాకిస్థానీ జర్నలిస్టు ఫరీద్ ఖురేషీ హస్తం ఉందని ఆరోపించారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి:
భారత్‌తో యుద్ధం మొదలైతే నేను ఇంగ్లండ్ వెళ్లిపోతా.. పాక్ సీనియర్ నేత
భారత్, పాక్ సైన్యాల శక్తిసామర్థ్యాలు ఇవీ..
పహల్గాం దాడిలో పాల్గొన్న ఉగ్రవాది ఓ మాజీ పాక్ పారా కమాండో!
Read More Latest Telugu News and International News
Updated Date - May 04 , 2025 | 11:38 AM