ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Ind-Pak War: భారత్‌తో యుద్ధాన్ని కొట్టి పారేయలేం.. దేశం మొత్తం రెడీగా ఉండాలి: పాకిస్థాన్ మంత్రి

ABN, Publish Date - Nov 20 , 2025 | 10:35 AM

ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో భారతదేశంతో పూర్తి స్థాయి యుద్ధం జరిగే అవకాశాన్ని కొట్టిపారెయ్యలేమని దేశమంతా అప్రమత్తంగా ఉండాలని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మంగళవారం హెచ్చరించారు.

Pak minister statement

సమీప భవిష్యత్తులో భారత్‌తో యుద్ధం జరిగే సూచనలు కనిపిస్తున్నాయని, దేశమంతా అప్రమత్తంగా ఉండాలని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మంగళవారం హెచ్చరించారు. ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో భారతదేశంతో పూర్తి స్థాయి యుద్ధం జరిగే అవకాశాన్ని కొట్టిపారెయ్యలేమని అన్నారు. ఆపరేషన్ సిందూర్‌ను కేవలం 88 గంటల ట్రైలర్ అని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఇటీవల అభివర్ణించిన సంగతి తెలిసిందే (India Pakistan latest news).

పొరుగు దేశంతో బాధ్యతాయుతంగా ఎలా ప్రవర్తించాలో వారికి (పాకిస్థాన్‌కు) నేర్పించడానికి భారత ఆర్మీ సిద్ధంగా ఉందని ద్వివేది హెచ్చరించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ టీవీ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'మేము భారతదేశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించడం లేదు. అలాగే విశ్వసించడం లేదు. భారతదేశం నుంచి సరిహద్దు చొరబాట్లు, దాడులతో పాటు పూర్తి స్థాయి యుద్ధం లేదా ఏదైనా శత్రు వ్యూహాన్ని నేను తోసిపుచ్చలేను. మనం పూర్తిగా అప్రమత్తంగా ఉండాలి' అని ఆసిఫ్ పేర్కొన్నారు (Pak minister statement).

ఇంతకు ముందు కూడా ఆసిఫ్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు (India Pak border tensions). 'తూర్పు (భారతదేశం), పశ్చిమ (అఫ్గానిస్థాన్) సరిహద్దులను ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మొదటి రౌండ్‌లో అల్లా మాకు సహాయం చేశాడు. రెండో రౌండ్‌లో కూడా ఆయన మాకు సహాయం చేస్తాడు. వారు చివరి రౌండ్ కోరుకుంటే, మాకు యుద్ధం తప్ప వేరే మార్గం లేదు' అని ఆసిఫ్ అన్నారు.

ఇవి కూాడా చదవండి..

ఆ సోషల్ మీడియా ఖాతాలను డిలీట్ చేయనున్న మెటా.. ఆస్ట్రేలియాలో కొత్త రూల్స్..

నా తల్లిని భారత్ రక్షించింది.. ప్రధాని మోదీకి రుణపడి ఉంటాం: షేక్ హసీనా కుమారుడు


మరిన్ని అంతర్జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Nov 20 , 2025 | 12:03 PM