ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Pakistan Blast: పాక్‌లో బాంబు పేలుడు.. 12 మంది మృతి

ABN, Publish Date - Nov 11 , 2025 | 04:13 PM

పాక్ రాజధాని ఇస్లామాబాద్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 12 మంది చనిపోయారు. మరో 20 మంది గాయపడ్డారు. ఈ ఘటనతో అక్కడి జనం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

Pakistan Blast

ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్‌లో భారీ పేలుడు సంభవించింది(Pakistan Explosion). ఇస్లామాబాద్‌ కోర్టు ఆవరణలోని ఓ కారులో బ్లాస్టింగ్ జరిగింది. ఈ ఘటనలో 12 మంది మరణించగా.. సుమారు 20 మందికి గాయాలైనట్టు తెలుస్తోంది. వాహనం లోపల గ్యాస్ సిలిండర్(Gas Cylinder) పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. పేలుడు ధాటికి సమీపంలోని వాహనాలకూ మంటలు వ్యాపించినట్టు స్థానికులు వెల్లడించారు. అయితే.. ఈ ఘటనపై వ్యాఖ్యానించడానికి అక్కడి పోలీసులు నిరాకరించారు.

బాంబు పేలుడు ఘటన దృశ్యాలు...

ఇస్లామాబాద్(Islamabad) కోర్టు వెలుపల జరిగిన ఈ పేలుడు ఘటనలో.. ఆ ప్రాంతంలో పార్క్ చేసిన మరికొన్ని వాహనాలూ దెబ్బతిన్నాయి. క్షతగాత్రుల్లో ఎక్కువ మంది విచారణ కోసం న్యాయస్థానానికి వచ్చినవారే ఉన్నట్టు తెలుస్తోంది. కోర్టుకు వచ్చిన రుస్తుం మాలిక్(Rustum Malik) అనే న్యాయవాది తన కారును పార్కింగ్ చేస్తుండగా.. ఈ పేలుడు శబ్దం వినిపించినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. పేలుడు శబ్దానికి ఉలిక్కిపడిన ప్రజలు.. ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురై ఎక్కడివారు అక్కడకు పరుగులు తీశారు.

ఇవీ చదవండి:

ఢిల్లీ పేలుళ్ల ఘటన.. కీలక వ్యక్తి ఫొటో వెలుగులోకి..

ఢిల్లీ పేలుడు ఘటన.. వెలుగులోకి సంచలన విషయాలు

Updated Date - Nov 11 , 2025 | 04:44 PM