BLA Attack: బీఎల్‌ఏ మెరుపు దాడులు.. పాక్ ఉక్కిరిబిక్కిరి
ABN, Publish Date - May 10 , 2025 | 03:50 PM
BLA Attack: పాక్ ఆర్మీపై బీఎల్‌ఏ మెరుపుదాడులకు దిగింది. బీఎల్‌ఏ దాడులతో పాక్ సైనికులకు భారీగా నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.
పాకిస్థాన్, మే 10: పాక్ ఆర్మీపై బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) విరుచుకుపడింది. మొత్తం 39 చోట్ల బీఎల్‌ఏ మెరుపు దాడులు చేసింది. ఈ దాడుల్లో పాకిస్థాన్ (Pakistan) సైనిక స్థావరాలు, గ్యాస్ పైప్‌లైన్లు, ప్రధాన రహదారులు లక్ష్యంగా మారినట్లు సమాచారం. బలూచిస్థాన్‌లోని కాలాత్ జిల్లాలోని మాంగోచర్ పట్టణాన్ని బీఎల్‌ఏ ప్రత్యేక బృందం 'ఫతే స్క్వాడ్'ను స్వాధీనం చేసుకుంది. దీంతో ఖజినాయ్ హైవేను మూసివేసి, స్థానిక పోలీసులను తాత్కాలికంగా అదుపులోకి తీసుకుని.. కొన్ని గంటల తరువాత వారిని విడుదల చేశారు. బీఎల్‌ఏ దాడుల్లో పాకిస్థాన్ సైనికులకు భారీగా ప్రాణ నష్టం జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు కచ్చి జిల్లాలో జరిగిన రోడ్‌సైడ్ బాంబు దాడిలో ఏడుగురు పాక్ సైనికులు మరణించినట్లు సమాచారం. గత కొన్ని రోజులుగా బలూచిస్థాన్‌లో హింస పెరుగుతోంది.
బలుచిస్థాన్ వేర్పాటు వాదులు, పాకిస్థాన్ సైన్యం మధ్య చాలా కాలంగా సమస్యలు కొనసాగుతున్నాయి. పాకిస్థాన్‌లో బలూచిస్థాన్ భౌగోళికంగా అతిపెద్ద రాష్ట్రం అయినప్పటికీ అభివృద్ధిలో మాత్రం బలూచిస్థాన్ చాలా వెనకబడి ఉంది. బలూచిస్థాన్ నుంచి ఆయిల్, గ్యాస్, ఖనిజాలు వంటి సంపదలు వెలువడుతున్నప్పటికీ దాని లాభాన్ని స్థానిక ప్రజలకు రాకుండా పాక్ సైనిక ప్రభుత్వ వ్యవస్థ కబ్జా చేసిందనేది బలూచిస్థాన్ ప్రజల ఆరోపణ. వేర్పాటు వాద భావాలను అణచివేసేందుకు పాక్ సైన్యం ఐఎస్‌ఐ వంటి సంస్థల ద్వారా బీఎల్‌ఏపైన తీవ్ర హింసకు పాల్పడుతోంది. వేలాది మంది యువకులు గల్లంతైన పరిస్థితి.
Operation Sindoor: భారత దాడుల్లో ఉగ్రవాదులు హతం.. లిస్ట్‌లో మోస్ట్ వాంటెడ్ వీళ్లే..
బలూచిస్థానీలు తమను పాక్‌లో భాగంగా కాకుండా వేరే దేశం కావాలని డిమాండ్ చేస్తున్నారు. పాకిస్థాన్ జాతీయ సమైక్యతకు ఇది ప్రమాదకరమనే భావంతో అక్కడి ప్రభుత్వం, సైన్యం బలూచిస్థాన్ ఉద్యమాలపైన నిర్ధాక్షణ్యంగా వ్యవహరిస్తోంది. పాకిస్థాన్ నుంచి పూర్తిస్థాయి స్వతంత్ర బలూచిస్థాన్ ఏర్పాటు చేయడమే బీఎల్‌ఏ లక్ష్యం. బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీకి అక్కడి ప్రజలు ఎక్కువగా మద్దుతు ఇస్తున్నారు. అక్కడ బలూచిస్థాన్‌కు రాజకీయంగా, ఆర్థికంగా స్వయం నిర్ణయాధికారం కల్పించడమే తమ లక్ష్యమని బీఎల్‌ఏ చెబుతోంది.
ఓవైపు పీవోకేలో పాకిస్థాన్‌పై భారత్ దాడులు చేస్తున్న నేపథ్యంలో పాక్ ఆర్మీకి వ్యతిరేకంగా బీఎల్‌ఏ కూడా తిరగబడుతోంది. అయితే బీఎల్‌ఏను పాకిస్థాన్, యూకే, అమెరికా వంటి దేశాలు ఉగ్రవాద సంస్థగా ప్రకటించాయి. బలూచ్ వాసులు మాత్రం ఈ బీఎల్‌ఏను వీర యోధుల పోరాట సంస్థగా చూస్తున్నారు.
ఇవి కూడా చదవండి
Operation Sindoor: పౌరులు, ఆలయాలపైనే పాక్ దాడి.. వీడియోలతో భారత్ కౌంటర్
Operation Sindoor: సోషల్ మీడియాలో పాకిస్తాన్ తప్పుడు ప్రచారం.. అందులో నిజం లేదు..
Read Latest International News And Telugu News
నా సిందూరాన్ని పంపుతున్నా..
Updated Date - May 10 , 2025 | 04:04 PM