Afghanistan-Pakistan Tensions: ఆఫ్ఘనిస్థాన్ మీద పాకిస్థాన్ వైమానిక దాడులు.. 12మందికి పైగా పౌరులు మృతి
ABN, Publish Date - Oct 15 , 2025 | 07:31 PM
కాందహార్ ప్రావిన్స్‌లోని పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాకిస్థాన్ దళాలు జరిపిన వైమానిక దాడుల్లో 12 మందికి పైగా ఆఫ్ఘన్ పౌరులు మృతి చెందినట్టు తెలుస్తోంది. ఇది ఇరు దేశాల మధ్య..
ఇంటర్నెట్ డెస్క్: కాందహార్ ప్రావిన్స్‌లోని పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాకిస్థాన్ దళాలు జరిపిన వైమానిక దాడుల్లో 12మందికి పైగా ఆఫ్ఘన్ పౌరులు మృతి చెందినట్టు తెలుస్తోంది. ఇది తాలిబన్ - పాకిస్థాన్ దళాల మధ్య తాజాగా కాల్పులకు దారితీశాయి. దీంతో రెండు పాత మిత్రదేశాల మధ్య వైరం తీవ్రతరమైంది. దీనిపై ఇరుపక్షాలూ ఒకరిపై మరొకరు ఆరోపణలు గుప్పించుకున్నాయి.
బుధవారం ఉదయం, కాందహార్‌లోని స్పిన్ బోల్డాక్ జిల్లాపై పాకిస్థాన్ దళాలు తేలికపాటి, భారీ ఆయుధాలతో దాడులు ప్రారంభించాయి. ఫలితంగా 12మందికి పైగా ఆఫ్ఘాన్ పౌరులు అమరులయ్యారు. కనీసం 100 మంది గాయపడ్డారని ఆఫ్ఘన్ ప్రభుత్వ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ తెలిపారు.
పాకిస్థాన్ చేసిన దాడి.. ఒక నివాస భవనాన్ని తాకడంతో ఆ ఇంట్లో చాలామంది పిల్లలు చనిపోయినట్టు తెలుస్తోంది. గాయపడ్డ వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. దీంతో ఆఫ్ఘన్ దళాలు కూడా ప్రతీకార చర్యకు దిగాయి. కాగా, పాకిస్థాన్ జరిపిన దాడిలో 15మంది పౌరులు మరణించారని AFP వార్తా సంస్థ నివేదించింది. గాయపడిన వారిలో 80మందికి పైగా మహిళలు, పిల్లలు ఉన్నారని తెలిపింది.
బుధవారం నాడు కాబూల్ శివార్లలో ఒక ఇంధన ట్యాంకర్ పేలింది. ఫలితంగా, భారీ అగ్నిప్రమాదం సంభవించిందని టోలోన్యూస్ నివేదించింది. వివాదం తగ్గే సూచనలు కనిపించకపోవడం, పాకిస్థాన్ మంత్రులను చర్చలకు ఆఫ్ఘనిస్తాన్ అనుమతించకపోవడంతో మధ్యవర్తులుగా వ్యవహరించడానికి ఖతార్, సౌదీ అరేబియాకు ఇస్లామాబాద్ ఫోన్ చేసినట్టు తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి:
జర్నలిజం విలువల పరిరక్షణలో ఏబీఎన్- ఆంధ్రజ్యోతి ముందుంది: సీఎం చంద్రబాబు
ప్రధాని మోదీ ఏపీ పర్యటనలో అప్రమత్తంగా ఉండాలి: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
Updated Date - Oct 15 , 2025 | 08:05 PM