Pak Official Throat Slit Gesture: గొంతు కోస్తా.. నిరసనకారులపై పాక్ అధికారి సంకేతం
ABN, Publish Date - Apr 26 , 2025 | 01:54 PM
పహల్గాం దాడిని వ్యక్తిరేకిస్తూ లండన్‌లోని పాక్ హైకమిషన్ ముందున్న నిరసనకారులను చూస్తూ ఓ పాకిస్థానీ అధికారి.. గొంతులు కోస్తా అనే అర్థం వచ్చేలా సైగ చేసిన వీడియో ప్రస్తుతం సంచలనంగా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: పహల్గాం దాడిలో మరణించిన వారందరూ సామాన్య పౌరులే, నిరాయుధులే. మనుషులెవరైనా ఈ దాడిని చూసి కన్నీరు పెట్టుకుంటారు. కానీ భారత్‌పై అకారణ ద్వేషాన్ని నరనరానా నింపుకున్న కొందరు పాకిస్థానీలను చూస్తే వారి మనసులు ఎంతగా కలుషితమైపోయాయో అర్థం చేసుకోవచ్చు. లండన్‌లోని పాక్ హైకమిషన్ అధికారి వీడియో ఇందుకు తాజాగా ఉదాహరణగా నిలుస్తోంది. దీనిపై ప్రస్తుతం నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పహల్గాం దాడి తరువాత లండన్‌లో పాకిస్థాన్ హైకమిషన్ ముందు కొందరు నిరసనకు దిగారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ పాక్ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న వైనంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హైకమిషన్‌లోని పాక్ అధికారి కల్నల్ తైముర్ రాహత్ తన మనసులో మరుగును నిస్సిగ్గుగా బయటపెట్టుకున్నారు. నిరసనకారులను చూస్తూ గొంతు కోసి చంపేస్తా అన్నట్టు సైగలు చేశారు. ఈ వీడియోపై జనాలు కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నా నెట్టింట మాత్రం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నిరసనల్లో సుమారు 300 మంది బ్రిటీష్ హిందువులు పాల్గొన్నారట. మృతుల కుటుంబాలకు న్యాయం జరగాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారట.
మరోవైపు, పహల్గామ్ దాడిపై నిష్పాక్షిక దర్యాప్తునకు తాము సిద్ధమేనని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. ఖైబర్ పాఖ్‌తూన్ఖ్వాలోని పాక్ మిలిటరీ అకాడమీలో ఆయన తాజాగా ప్రసంగించారు. విశ్వనీయ దర్యాప్తులో భాగమయ్యేందుకు తాము సిద్ధమేనని పేర్కొన్నారు. భారత్, పాక్ మధ్య పరస్పర ఆరోపణలకు ముగింపు పడాలని చెప్పుకొచ్చారు. ఈ దాడికి తామే కారణమని చెప్పుకున్న ఎల్‌ఈటీ అనుబంధన సంస్థ టీఆర్ఎఫ్ తాజాగా ప్లేటు ఫిరాయించింది. తమ డిజిటల్ వేదికలపై జరిగిన సైబర్ దాడితో ఇలాంటి ప్రకటన విడుదలైనట్టు చెప్పుకొచ్చింది. ఈ ఘటనను తమకు ఆపాదించడం తొందర పాటు చర్యేనని వ్యాఖ్యానించింది. ఈ దాడిలో పాల్గొన్న ప్రధాని నిందితుడు అదిల్ అహ్మద్ తోమర్ పాక్‌లో శిక్షణ పొంది , ఆరేళ్ల తరువాత భారత్‌లోకి తిరిగి ప్రవేశించినట్టు నిఘా వర్గాలు తాజాగా గుర్తించాయి.
ఇవి కూడా చదవండి..
అదే జరిగితే సింధూ నదిలో వారి రక్తం పారుతుంది.. బిలావాల్ భుట్టో పిచ్చి కూతలు
అమెరికా కోసమే ఇదంతా.. ఉగ్రవాదంపై పాక్ రక్షణ శాఖ మంత్రి షాకింగ్ వ్యాఖ్య
పహల్గాం దాడిపై తొలిసారి స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
Read Latest and International News
Updated Date - Apr 26 , 2025 | 02:50 PM