ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Pahalgam Terror Attack: ఉగ్రవాదుల కోసం వేట.. కొలంబో ఎయిర్‌పోర్టులో భారీ సెర్చ్ ఆపరేషన్

ABN, Publish Date - May 03 , 2025 | 05:36 PM

Pahalgam Terror Attack: వారు శ్రీలంక ఎయిర్ లైన్స్‌కు చెందిన యూఎల్ 122 విమానంలో చెన్నైనుంచి శ్రీలంకకు వెళుతున్నట్లు చెన్నై ఏరియా కంట్రోల్ సెంటర్ అధికారులకు సమాచారం అందింది. వారు వెంటనే అలర్ట్ అయ్యారు.

Pahalgam Terror Attack

పహల్గామ్‌లో పర్యాటకులపై కాల్పులకు పాల్పడిన ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్లు జెట్ స్పీడుతో సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అనుమానిత ఉగ్రవాదుల కోసం శ్రీలంక దేశంలోని కొలంబో ఎయిర్‌పోర్టులో భారీ సెర్చ్ ఆపరేషన్ జరిగింది. పహల్గామ్ ఉగ్రదాడిలో పాత్ర ఉందని భావిస్తున్న ఆరుగురి కోసం ఈ సెర్చ్ ఆపరేషన్ జరిగింది. వారు శ్రీలంక ఎయిర్ లైన్స్‌కు చెందిన యూఎల్ 122 విమానంలో చెన్నైనుంచి శ్రీలంకకు వెళుతున్నట్లు చెన్నై ఏరియా కంట్రోల్ సెంటర్ అధికారులకు సమాచారం అందింది. వారు వెంటనే అలర్ట్ అయ్యారు.


శ్రీలంక ఎయిర్ పోర్టు అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే శనివారం మధ్యాహ్నం బండారనాయకే ఇంటర్ నేషనల్ ఎయిర్‌పోర్టులో భారీ సెర్చ్ ఆపరేషన్ జరిగింది. స్థానిక అధికారుల సాయంతో ఆరుగురు అనుమానిత ఉగ్రవాదులకోసం వెతికారు. అయితే, ఆ విమానంలో ఆ అనుమానిత ఉగ్రవాదులు ఉన్నారా.. లేదా.. అన్న దానిపై ఎలాంటి సమాచారం లేదు. స్థానిక మీడియా ఇచ్చిన సమాచారంతో సెర్చ్ ఆపరేషన్‌కు సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చాయి.


సరిహద్దుల్లో యుద్ద వాతావరణం

ఉగ్రదాడి తర్వాత ఇండియా పాకిస్తాన్‌ల మధ్య యుద్ధ వాతారణ పరిస్థితులు నెలకొన్నాయి. భూమితో పాటు నీటిపై కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. పాకిస్తాన్ పరిస్థితి దారుణంగా తయారైంది. ఇండియానుంచి ముప్పు తప్పదన్న నిర్ణయానికి వచ్చేసింది. సరిహద్దుల దగ్గర ఉన్న ప్రజల్ని ఇందుకోసం సిద్ధం చేస్తూ ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ ఉగ్రవాదుల్ని..ఉగ్రవాదులకు సాయం చేస్తున్న పాకిస్తాన్‌ను వదిలిపెట్టేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి

Pahalgam Terror Attack: ఆ ఉగ్రవాదుల్ని వదిపెట్టం.. స్పష్టం చేసిన ప్రధాని మోదీ

Janu Lyri: రెండో పెళ్లి కన్ఫార్మ్ చేసిన జాను లిరి.. అతడి ఫొటో షేర్ చేసి మరీ..

Updated Date - May 03 , 2025 | 05:40 PM