ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Physics Nobel 2025: ఫిజిక్స్‌లో ముగ్గురికి నోబెల్ ప్రైజ్

ABN, Publish Date - Oct 07 , 2025 | 03:54 PM

‌అమెరికాకు చెందిన ముగ్గురికి ఉమ్మడిగా భౌతికశాస్త్రంలో నోబెల్ పురస్కారాలు లభించాయి. జాన్‌ క్లార్క్, మైఖేల్ డెవోరెట్, జాన్ ఎం.మార్టినిస్‌ లను ఈ ఏడాది బహుమతి వరించింది. క్వాంటమ్ మెకానిక్స్‌ అండ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్‌లో..

Nobel Prize 2025 in Physics

స్వీడన్‌, అక్టోబర్ 7: 2025 సంవత్సరానికి గాను ఫిజిక్స్‌లో ప్రతిభ చూపిన వారికి ఇవాళ నోబెల్ ప్రైజ్‌లు ప్రకటించారు. అమెరికాకు చెందిన ముగ్గురికి భౌతికశాస్త్రంలో నోబెల్ పురస్కారాలు లభించాయి. జాన్‌ క్లార్క్, మైఖేల్ డెవోరెట్, జాన్ ఎం.మార్టినిస్‌ లను ఈ ఏడాది నోబెల్ బహుమతి వరించింది. క్వాంటమ్ మెకానిక్స్‌ అండ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్‌లో పరిశోధనలకు గాను వీరికి నోబెల్ పురస్కారం దక్కింది.

స్వీడన్‌లోని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఇవాళ (అక్టోబర్ 7)న ఈ అవార్డులను ప్రకటించింది. నిన్న వైద్య శాస్త్రంలో నోబెల్ అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే. మిగతా విభాగాలైన, కెమిస్ట్రీ, లిటరేచర్, శాంతి, ఎకనామిక్స్‌లో అవార్డుల్ని రాబోయే రోజుల్లో ప్రకటిస్తారు. డిసెంబర్ 10న స్టాక్‌హోమ్‌లో అవార్డు గ్రహీతలకు ప్రదానోత్సవ కార్యక్రమం జరుగుతుంది.

ఇలా ఉండగా, స్వీడన్‌‌కు చెందిన సైంటిస్ట్, ఇంజినీర్‌, బిజినెస్‌మెన్‌ అయిన ఆల్ఫ్రెడ్‌ నోబెల్‌ పేరిట ఈ అవార్డులు ఇస్తున్నారు. ఆల్ఫ్రెడ్‌ వర్ధంతి రోజైన డిసెంబర్ 10వ తేదీన ఈ పురస్కారాలు అందిస్తారు. 1896లో ఆల్ఫ్రెడ్‌ నోబెల్‌ మరణించగా.. 1901 నుంచి నోబెల్ ట్రస్ట్ ద్వారా ఈ నోబెల్ అవార్డులను ప్రతీ సంవత్సరం ప్రదానం చేస్తున్నారు.

నోబెల్ బహుమతి విజేతలకు నోబెల్ బహుమతితో పాటు.. 10 లక్షల డాలర్లు అంటే, మన కరెన్సీలో దాదాపు రూ.8.4 కోట్ల నగదు అందజేస్తారు.

ఇవి కూడా చదవండి..

అన్నాడీఎంకే వైపు విజయ్‌ చూపు.. పొత్తుపై రహస్య మంతనాలు

కరూర్ తొక్కిసలాట ఘటనపై సుప్రీంకోర్టులో పిటిషన్..

Read Latest Telangana News and National News

Updated Date - Oct 07 , 2025 | 04:36 PM