ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

New Visa Rules : ఐటీ ఉద్యోగులకు ఆ దేశం బంపర్ ఆఫర్.. వీసా నిబంధనల సడలింపు..

ABN, Publish Date - Jan 29 , 2025 | 02:44 PM

ప్రస్తుతం అమెరికాలో కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్న భారతీయులకు శుభవార్త. ఐటీ ఉద్యోగులకు ఓ దేశం బంపర్ ఆఫర్ ప్రకటించింది. అమెరికా నుంచి ఐటీ నిపుణులను ఆకర్షించడమే లక్ష్యంగా కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీయులు తమ దేశానికి వచ్చి పనిచేసేందుకు వీలుగా వీసా నిబంధనలను సడలించింది..

New Zealand Simplifies Visa Process to Attract Tech-Savvy Tourists

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు యూఎస్‌లో స్థిరపడాలని ఆశపడేవారి గుండెల్లో గుబులు రేపుతున్నాయి. బర్ట్ రైట్ సిటిజన్‌షిప్ హక్కు రద్దు, గ్రీన్ కార్డు, వీసా నిబంధనలు కఠినతరం చేయడం లాంటి నిర్ణయాలు ప్రధానంగా ప్రభావం చూపించేంది భారతీయులపైనే. ఎందుకంటే, భారతదేశం నుంచే అధికంగా ఐటీ ఉద్యోగులు తాత్కాలిక వీసాపై అక్కడి కంపెనీల్లో పనిచేస్తుంటారు. అమెరికాలోని ప్రస్తుత పరిస్థితుల్లో వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఈ అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకునేందుకు ఆ దేశం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విదేశీయులు, ప్రధానంగా ఐటీ నిపుణులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. విదేశీ ఉద్యోగులను తమ దేశానికి రప్పించేందుకు వీసా నిబంధనలు సడలిస్తూ నిర్ణయం తీసుకుంది...


విదేశాల్లో ఐటీ రంగంలో స్థిరపడాలని కలలు కనే యువతకు న్యూజిలాండ్ శుభవార్త చెప్పింది. వలసలు అరికట్టేందుకు గతంలో వీసా నిబంధనలు కఠినతం చేసిన వెల్లింగ్‌టన్.. ఇప్పుడు నిర్ణయం మార్చుకుంది. కరోనా మహమ్మారి కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా పర్యాటక అభివృద్ధి, అమెరికా నుంచి ఐటీ నిపుణులను ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకుంది. అమెరికాలో కఠిన పరిస్థితుల్లో చిక్కుకున్న భారతీయులకు న్యూజిలాండ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వరం కానుంది.


ప్రయాణిస్తూ జాబ్ చేసుకోవచ్చు..

కొత్త వీసా నిబంధనల ప్రకారం, విదేశీయులు న్యూజిలాండ్‌లో ప్రయాణించడమే కాకుండా పని కూడా చేసుకోవచ్చు. ఆర్థికాభివృద్ధి మంత్రి నికోలా విల్లిస్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ న్యూజిలాండ్ ప్రభుత్వం అధిక నైపుణ్యం కలిగిన వ్యక్తులను తమ దేశానికి తీసుకురావాలని కోరుకుంటోందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఆగ్నేయాసియా , అమెరికా నుంచి IT రంగంలో నైపుణ్యం కలిగిన వారిని ఆకర్షించాలని వెల్లింగ్‌టన్ లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల పర్యాటకం వృద్ధి చెందుతుందని, ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని న్యూజిలాండ్ భావిస్తోంది. అంతుకు ముందే ప్రధాన మంత్రి క్రిస్టోఫర్ లక్సన్ 'ఇన్వెస్ట్ న్యూజిలాండ్' అనే కొత్త ప్రతిపాదన చేశారు. విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించి ఆర్థికాభివృద్ధిని సాధించడమే దీని వెనక గల ఉద్దేశం.


కొత్త వీసా నిబంధన 'వర్క్‌కేషన్' ?

తమ పెట్టుబడులను పెంచుకునేందుకు వీలుగా న్యూజిలాండ్‌ కొత్త వీసా నిబంధనలు అమల్లోకి తెచ్చింది. ఎవరైనా విదేశాల్లో ఉంటూ 90 రోజులకు పైగా పని చేస్తే వారు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. న్యూజిలాండ్‌లో రిమోట్‌గా పని చేయడానికి ఎలాంటి పన్ను ఉండదు. విదేశాలలో 'వర్క్‌కేషన్' చేయాలనుకునే వ్యక్తులకు న్యూజిలాండ్ గమ్యస్థానంగా ఉండాలనే లక్ష్యంతో సరికొత్త వీసా నిబంధనలు తీసుకొచ్చింది. అయితే, ప్రజలు తమ సొంత దేశంలోని కంపెనీకి మాత్రమే న్యూజిలాండ్‌లో రిమోట్‌గా పని చేయడానికి అనుమతిస్తారు. మీరు న్యూజిలాండ్‌లోని స్థానిక కంపెనీలో పని చేయలేరు. 'డిజిటల్ నోమాడ్స్' వంటి వీసాల ద్వారా రిమోట్ వర్కర్లకు పని చేసే అవకాశాన్ని కల్పిస్తున్న దేశాల్లో న్యూజిలాండ్. స్పెయిన్, జపాన్, దక్షిణ కొరియా, బ్రెజిల్, పోర్చుగల్, థాయ్‌లాండ్‌లు ఉన్నాయి.

Updated Date - Jan 29 , 2025 | 03:20 PM