ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Nevada Gold Mines: ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు గని.. ఎక్కడుందో తెలుసా?

ABN, Publish Date - Oct 13 , 2025 | 03:19 PM

ప్రస్తుతం బంగారం ధర సామాన్యులకు అందనంత దూరంలో ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1.25 లక్షలు దాటింది. కేవలం ఈ ఒక్క సంవత్సరంలోనే దాదాపు 50 శాతం ధర పెరిగింది. ఇదే సమయంలో కొందరికి విచిత్రమైన ప్రశ్నలు వస్తున్నాయి. అలాంటి వాటిల్లో ప్రపంచంలో అత్యధిక బంగారం ఎక్కడ ఉంది?.

Nevada Gold Mines

బంగారం..ఈ పేరు వింటేనే చాలా మందిలో వైబ్రేషన్లు వస్తాయి. కారణంగా దానిపై వారికి ఉండే మక్కువ. ముఖ్యంగా మహిళలు బంగారం పేరు వినగానే అటెన్షన్ అవుతుంటారు. పసిడిని కొనేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. ఇది ఇలా ఉంటే..ప్రస్తుతం బంగారం ధర సామాన్యులకు అందనంత దూరంలో ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1.25 లక్షలు దాటింది. కేవలం ఈ ఒక్క సంవత్సరంలోనే దాదాపు 50 శాతం ధర పెరిగింది. ఇదే సమయంలో కొందరికి విచిత్రమైన ప్రశ్నలు వస్తున్నాయి. అలాంటి వాటిల్లో ప్రపంచంలో అత్యధిక బంగారం ఎక్కడ ఉంది?. ఏ దేశంలో ఎక్కువ ఉత్పత్తి అవుతుంది? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఆ దేశం ఏంటి, అక్కడ ఏడాదికి ఎంత బంగారాన్ని వెలికి తీస్తారో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. మరి.. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

ప్రపంచంలో అతి పెద్ద బంగారు గని పేరు నెవాడా గోల్డ్ మైన్(Nevada Gold Mines). ఇది అమెరికా(America)లోని నెవాడా రాష్ట్రంలో ఉంది. ఈ గనిలో ఏటా టన్నుల కొద్ది గోల్డ్ ను వెలికి తీస్తుంటారు. భూమిపైనే అతిపెద్ద బంగారు గనిగా ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది. ఈ బంగారు గనిని బారిక్ గోల్డ్, న్యూమెంట్ కార్పొరేషన్ అనే సంస్థలు కలిపి నడుపుతున్నాయి. ఈ గనిలో ఏటా సుమారు వంద టన్నులు అంటే లక్ష కిలోల గోల్డ్ ను బయటకు తీస్తున్నారు. ప్రస్తుతం భూమిపై వినియోగంలో ఉన్న అతిపెద్ద బంగారు గని ఇదేనని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

అగ్రరాజ్యమైన అమెరికా(America) ఆర్థిక వ్యవస్థకు ఈ బంగారు గని ఒక అక్షయపాత్రలా ఉపయోగపడుతుంది. ప్రస్తుతానికి వరల్డ్ లో ఎక్కువ గోల్డ్(Gold) రిజర్వ్స్ ఉన్న దేశం కూడా యూఎస్ఏ కావడం గమన్హారం. అంతాల అమెరికా బంగారాన్ని రిజర్వ్ చేయడానికి ఈ గని కూడా ఒక కారణం అక్కడి మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక పోతే మనదేశంలో కూడా బంగారు గనులు ఉన్నాయి. అయితే వాటి నుంచి లభించే బంగారం చాలా తక్కువ. ఇక్కడ బంగారు(Gold Mine) ఉత్పత్తికి అయ్యే ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం బంగారం ఇతర దేశాల నుంచే ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాం.

ఇవి కూడా చదవండి:

నోబెల్‌ శాంతి బహుమతి సమాచారం లీక్‌

58 మంది పాక్‌ సైనికులను చంపాం: అప్ఘాన్ మంత్రి

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 13 , 2025 | 03:19 PM