Musk vs Trump: చట్టసభ సభ్యులకు ఎలాన్ మాస్క్ కీలక సూచన
ABN, Publish Date - Jun 05 , 2025 | 01:20 PM
గతేడాది అమెరికా దేశాధ్యక్షుడి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ట్రంప్ గెలుపు కోసం ఎలాన్ మస్క్ కోట్లాది రూపాయిలు ఖర్చు చేశారు. ఈ ఎన్నికల్లో ట్రంప్ ఘన విజయం సాధించారు. కానీ ట్రంప్ తీసుకున్న నిర్ణయాల కారణంగా సర్వత్ర విమర్శలు వెల్లువెత్తాయి.
వాషింగ్టన్, జూన్ 05: ధనికులు, సంస్థలకు 4 ట్రిలియన్ డాలర్ల మేర పన్నులు తగ్గించేందుకు అమెరికా దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బిల్లు తీసుకొస్తున్నారు. అలాంటి తరుణంలో టెస్లా అధినేత ఎలెన్ మస్క్ తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు. బిల్లుకు వ్యతిరేకంగా ఆయన ప్రచారాన్ని చేపట్టారు. అందులోభాగంగా ఈ బిల్లుకు ఆమోదం తెలపవద్దని చట్ట సభ సభ్యులకు ఆయన పిలుపు నిచ్చారు. అమెరికా దివాల తీయడం తమకు ఇష్టం లేదని చెప్పాలని అమెరికా చట్ట సభ సభ్యులకు ఆయన కీలక సూచన చేశారు. ఇప్పటికే దేశంలో రుణం బాగా పెరిగిందన్నారు. ఈ బిల్లు వల్ల ప్రజలపై మరింత భారం పడుతుందని ఆయన పేర్కొన్నారు.
ఈ బిల్లు వల్ల అమెరికా చరిత్రలోనే రుణం భారం పెరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇది భారీ అందమైన బిల్లు అంటూ ఆయన ఈ సందర్భంగా అభివర్ణించారు. ఇప్పటికే ఈ బిల్లు అమెరికన్ కాంగ్రెస్ దిగువ సభ ఆమోదం పొందింది. సెనెట్ ఎగువ సభ ఆమోదం పొందాల్సి ఉంది. ఈ బిల్లు రెండు సభల ఆమోదం పొందితే.. హరిత ఇంధనాలకు, విద్యుత్ వాహనాలకు నిధులు తగ్గిస్తుంది. ఇది అమెరికాలో అతి పెద్ద విద్యుత్ వాహన సంస్థ టెస్లాకు గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉంది. మరోవైపు అమెరికా ప్రభుత్వ రుణ భారం భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో పలు ప్రజా ప్రయోజనాలపై ట్రంప్ ప్రభుత్వం కోత విధించిన సంగతి తెలిసిందే.
గతేడాది నవంబర్‌లో అమెరికా దేశాధ్య ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ట్రంప్ గెలుపు కోసం ఎలాన్ మస్క్ కోట్లాది రూపాయిలు ఖర్చు చేశారు. ఈ ఎన్నికల్లో ట్రంప్ ఘన విజయం సాధించారు. దీంతో ఎలాన్ మస్క్‌ను డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ చీఫ్‌గా బాధ్యతలు అప్పగించారు. కానీ దేశాధ్యక్షుడిగా ట్రంప్ తీసుకొంటున్న నిర్ణయాలపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతోన్నాయి. అలాంటి వేళ.. ఇటీవల ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ పదవి నుంచి తప్పుకొంటున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ పదవి నుంచి తప్పుకున్న ఎలాన్ మస్క్‌ను ట్రంప్ ప్రశంసించి.. బహుమతి అందజేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రధాని మోదీ సూచనలు పరిగణలోకి తీసుకోండి: సీఎం ఆదేశం
మరింత మెరుగ్గా ఏర్పాట్లు చేయాల్సింది: బీసీసీఐ
For International News And Telugu News
Updated Date - Jun 05 , 2025 | 01:38 PM