Modi Assures Support for Peaceful: యుద్ధాన్ని ఆపేందుకు సహకరిస్తాం
ABN, Publish Date - Aug 12 , 2025 | 04:25 AM
ఉక్రెయిన్ యుద్ధానికి సాధ్యమైనంత త్వరలో, శాంతియుత పరిష్కారం కనుగొనేందుకు అన్ని
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో మోదీ
న్యూఢిల్లీ, ఆగస్టు 11: ఉక్రెయిన్ యుద్ధానికి సాధ్యమైనంత త్వరలో, శాంతియుత పరిష్కారం కనుగొనేందుకు అన్ని రకాలుగా సహకరిస్తామని ప్రధాని మోదీ చెప్పారు. సోమవారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ఫోన్‌లో మాట్లాడిన మోదీ.. ఈ విషయాన్ని ఆయనకు స్పష్టం చేశారు. మూడు రోజుల కిందట రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో చర్చించిన మోదీ.. తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడితోనూ మాట్లాడారు. శాంతియుత పరిష్కారం కనుగొనేందుకు అన్ని విధాలా సహకరిస్తామని చెప్పారు. అలాగే భారత్-ఉక్రెయిన్ సంబంధాల బలోపేతానికి కూడా కట్టుబడి ఉన్నామని తెలిపారు. శాంతి ప్రయత్నాల్లో మోదీ మద్దతుగా నిలుస్తామని ప్రకటించడాన్ని అభినందిస్తూ జెలెన్‌స్కీ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. అయితే, రష్యా నుంచి చమురు కొనుగోళ్లను తగ్గించాలని సూచించారు. అలా చేస్తే రష్యాకు యుద్ధం కొనసాగించే ఆర్థిక సామర్థ్యం తగ్గుతుందని తెలిపారు.
Updated Date - Aug 12 , 2025 | 04:25 AM