ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

High Tariffs On Indian Goods: అమెరికాను ఫాలో అవుతున్న మెక్సికో.. భారత్‌కు భారీ షాక్..

ABN, Publish Date - Dec 12 , 2025 | 10:50 AM

అమెరికా బాటలోనే మెక్సికో కూడా భారత్‌పై భారీ మొత్తంలో టారీఫ్‌లు విధించడానికి సిద్ధమైంది. వాషింగ్టన్ నుంచి మెక్సికన్ ప్రెసిడెంట్ క్లౌడియా షేన్‌బామ్స్‌కు ఒత్తిడి ఉండటం వల్లే ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

High Tariffs On Indian Goods

అగ్రరాజ్యం అమెరికా గత కొన్ని నెలల నుంచి భారత్‌పై భారీ టారీఫ్‌లు విధిస్తున్న సంగతి తెలిసిందే. తమతో ట్రేడ్ డీల్స్ చేసుకోని కారణంగా భారత్‌పై అమెరికా గుర్రుగా ఉంది. రష్యాతో ఆయిల్ ఒప్పందాలు కూడా ఇందుకు మరో కారణం అవుతున్నాయి. అమెరికా ప్రతీ రంగాన్ని టార్గెట్ చేసి భారత్‌పై భారీ మొత్తంలో టారీఫ్‌లు విధిస్తోంది. ఇప్పుడు భారత్‌ నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే బియ్యంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కన్నుపడింది. బియ్యం దిగుమతిని అడ్డుకోవటానికి పెద్ద ప్లాన్ వేస్తున్నారు. పెద్ద మొత్తంలో టారీఫ్‌లు విధించాలని డిసైడ్ అయ్యారు. రెండు రోజుల క్రితం వైట్ హౌస్‌లో జరిగిన సమావేశంలో భారత్ బియ్యంపై చర్చ జరిగింది. ఈ చర్చలో భాగంగా ట్రంప్ మాట్లాడుతూ.. ‘అమెరికా రీటేల్ రైస్ మార్కెట్‌లో రెండు అతి పెద్ద బ్రాండ్స్ ఉన్నాయి. వాటి సంగతి మేము చూసుకుంటాము. అది చాలా సులభం. మళ్లీ పెద్ద మొత్తంలో టారిఫ్‌లు వేస్తే రెండు నిమిషాల్లో సమస్య పరిష్కారం అవుతుంది’ అని అన్నారు.

అమెరికా బాటలో మెక్సికో..

అమెరికా పొరుగు రాష్ట్రం మెక్సికో కూడా భారత్‌ను టార్గెట్ చేసింది. భారత్ నుంచి దిగుమతి చేసుకుంటున్న కొన్ని వస్తువులపై ఏకంగా 50 శాతం టారీఫ్‌లు విధించడానికి సిద్ధమైంది. భారత్‌తో పాటు మరికొన్ని ఆసియా దేశాలపై కూడా 50 శాతం టారీఫ్ వేయడానికి సిద్ధమైంది. ఈ దేశాలు మెక్సికోతో ట్రేడ్ డీల్ చేసుకోకపోవటంతోటే ఈ నిర్ణయం తీసుకుంది. దీని వెనుక అమెరికా కుట్ర ఉన్నట్లు తెలుస్తోంది. వాషింగ్టన్ నుంచి మెక్సికన్ ప్రెసిడెంట్ క్లౌడియా షేన్‌బామ్స్‌కు ఒత్తిడి ఉండటం వల్లే ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. చైనాతో వ్యాపారాన్ని కూడా మెక్సికో బాగా తగ్గించింది.

స్థానిక వ్యాపారులు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ వ్యాపారాలు దారుణంగా నష్టపోతాయని అంటున్నారు. టారీఫ్‌లు పెంచితే ధరలు కూడా పెరుగుతాయని వాపోతున్నారు. ఆటో పార్ట్స్, లైటర్ కార్స్, బొమ్మలు, బట్టలు, టెక్స్‌టైల్స్, ప్లాస్టిక్స్, ఫర్నిచర్, ఫుట్‌వేర్, స్టీల్, హౌస్‌హోల్డ్ అప్లయెన్సెస్, లెథర్ గూడ్స్, అల్యూమినియం, పేపర్, గ్లాస్, సోప్స్, కార్డ్‌బోర్డ్, మోటార్ సైకిల్స్, పర్‌ఫ్యూమ్స్, కాస్మెటిక్స్‌పై మెక్సికో ప్రభుత్వం 50 శాతం టారీఫ్ విధించింది. కాగా, భారత్, మెక్సికో దేశాల మధ్య మంచి వ్యాపార సంబంధాలు ఉన్నాయి. 2023 నుంచి 2024 మధ్య కాలంలో 8.4 బిలియన్ డాలర్ల వ్యాపారం జరిగింది.

ఇవి కూడా చదవండి

కాల్షియం లోపం..ఈ లక్షణాలతో జాగ్రత్త.!

హామీలు ఇవ్వడమే తప్ప ప్రభుత్వం నెరవేర్చిందేమీ లేదు

Updated Date - Dec 12 , 2025 | 10:57 AM