ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Maria Corina Machado Wins Nobel Peace Prize: మరియా కొరినాను వరించిన నోబెల్ శాంతి బహుమతి

ABN, Publish Date - Oct 10 , 2025 | 02:44 PM

ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతిని మారియా కోరినా గెలుచుకున్నారు. దీంతో ఈ బహుమతిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పెట్టుకున్న ఆశలపై నీళ్లు జల్లినట్లు అయింది.

Maria Corina Machado

స్వీడన్, అక్టోబర్ 10: ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి వెనెజులా ప్రతిపక్ష నేత మరియా కొరినా మచాడోను వరించింది. ఆ దేశ ప్రజల ప్రజాస్వామ్య హక్కుల కోసం చేసిన పోరాటానికి గాను ఆమెను ఈ బహుమతికి ఎంపిక చేశారు. వెనెజులా ప్రజల ప్రజాస్వామ్య హక్కులను ప్రోత్సహించడంలో మచాడో అవిశ్రాంత కృషి చేశారని నోబెల్ కమిటీ ప్రకటించింది. అలాగే నియంతృత్వం నుంచి న్యాయమైన ప్రజాస్వామ్యం, శాంతియుత పరివర్తన కోసం చేసిన పోరాటానికి గాను ఆమెకు ఈ గుర్తింపు లభించిందని ఆ కమిటీ పేర్కొంది. దేశంలో ప్రజాస్వామ్య జ్వాలలను వెలిగిస్తూ.. ధైర్యవంతమైన, నిబద్ధత కలిగిన శాంతి విజేత అంటూ మచాడోపై సదరు కమిటీ ప్రశంసల జల్లు కురిపించింది. దేశ ప్రజల ప్రజాస్వామ్య హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేయడంతో.. ఈ ఏడాది ప్రజలను ప్రభావితం చేసిన 100 మంది ప్రభావంతుల జాబితాలో ఆమె పేరు చేర్చారు.

మరోవైపు నోబెల్ శాంతి బహుమతికి మరియా కొరినా ఎంపిక కావడంతో.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ బహుమతిపై పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి. నోబెల్ శాంతి బహుమతి అందుకోవాలని ట్రంప్ అధ్యక్ష పీఠం ఎక్కిన నాటి నుంచి తహతహలాడిపోతున్నారు. ఆ క్రమంలోనే పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పీవోకేతోపాటు పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత సైన్యం దాడులు చేపట్టింది. కొన్ని గంటల తర్వాత ఈ దాడులు ఆగిపోయాయి.

దీంతో ఈ దాడులు తన ఆదేశాలకు అనుగుణంగానే ఆగిపోయాయంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వివిధ వేదికల మీద నుంచి పలు సందర్భాల్లో ప్రపంచానికి చాటే ప్రయత్నం చేశారు. కానీ ట్రంప్ చేసిన ఈ తరహా వ్యాఖ్యలను భారత్ నిర్ద్వంద్వంగా తొసిపుచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఒక్కటే కాదు.. దాదాపు ఏడు యుద్ధాలను తానే ఆపానంటూ ట్రంప్ చెబుతున్నా.. ఈ శాంతి బహుమతి మాత్రం వెనెజులా ప్రతిపక్ష నేత మరియా కొరినా మచాడోను వరించింది.

ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం కాన్వాయ్‌ అంబులెన్స్‌కు ఇన్సూరెన్స్‌ మరిచారు

భార్య డబ్బులు ఇవ్వలేదని చెరువులో దూకిన భర్త

Read Latest International News and Telugu News

Updated Date - Oct 10 , 2025 | 03:49 PM