ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Navya Nair: మల్లెపూలు తీసుకెళ్లినందుకు.. 1.14 లక్షల జరిమానా

ABN, Publish Date - Sep 09 , 2025 | 02:57 AM

మహిళలు తమ జడలో పూలు పెట్టుకోవడం దక్షిణ భారతదేశంలో ఎంతో సహజం. ముఖ్యంగా మల్లెపూలు...

  • ఆస్ట్రేలియాలో మలయాళ నటి నవ్య నాయర్‌కు చేదు అనుభవం

  • కఠిన బయో సెక్యూరిటీ చట్టాలే కారణం

  • మెల్‌బోర్న్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఘటన

న్యూఢిల్లీ, సెప్టెంబరు 8: మహిళలు తమ జడలో పూలు పెట్టుకోవడం దక్షిణ భారతదేశంలో ఎంతో సహజం. ముఖ్యంగా మల్లెపూలు... అయితే మల్లెపూలు తెచ్చుకోవడం కూడా నేరమే ఆస్ట్రేలియాలో..! ఈ కారణంగానే మలయాళ నటి నవ్య నాయర్‌కు మెల్‌బోర్న్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ.1.14 లక్షల జరిమానావిధించారు! మలయాళ నటి నవ్య నాయర్‌ ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో మలయాళి అసోసియేషన్‌ నిర్వహించిన ఓనం వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లారు. ఈ సమయంలో తనతోపాటు హ్యాండ్‌బ్యాగులో 15 సెంటిమీటర్ల మల్లెపూల దండను తీసుకెళ్లినందుకు మెల్‌బోర్న్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఆమెకు రూ.1.14 లక్షల జరిమానా విధించారు. అయితే ఇది అనుకోకుండా జరిగిందని ఆమె చెప్పారు. మల్లెపూలు తెచ్చుకోవడం అక్కడ చట్ట వ్యతిరేకమని తనకు తెలియదని పేర్కొన్నారు. అక్కడి అధికారులు తనను 1,980 ఆస్ట్రేలియన్‌ డాలర్ల(రూ.1.14 లక్షలు) జరిమానా చెల్లించాలని కోరారని తెలిపారు. కాగా మెల్‌బోర్న్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో కఠినమైన ‘బయో సెక్యూరిటీ’ చట్టాలు అమలులో ఉన్నాయి. విదేశాల నుంచి వచ్చేవారు తమ వెంట పూలు, పండ్లు, విత్తనాలతోపాటు పాల ఉత్పత్తులు, పలు స్వీట్లు తేకుండా నిషేధించారు. వాటివల్ల తోటి ప్రయాణికులకు, తమ దేశంలో ప్రజలకు వ్యాధులు, తెగుళ్లు సోకే ప్రమాదం ఉందని ఇటువంటి నిబంధనలు విధించారు. అయితే ఈ ఘటనతో నవ్య నాయర్‌ విచారానికి గురవకుండా విక్టోరియాలో ఓనం వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నార

ఇవి కూడా చదవండి..

ఉప రాష్ట్రపతి ఎన్నికలో తొలి ఓటు వేసేది ఎవరంటే..

రేపే ఉపరాష్ట్రపతి ఎన్నిక

For More National News And Telugu News

Updated Date - Sep 09 , 2025 | 02:57 AM