Kamchatka Earthquake: రష్యాలోని కామ్చట్కా ద్వీపకల్పంలో 7.8 తీవ్రతతో భారీ భూకంపం
ABN, Publish Date - Sep 19 , 2025 | 07:32 AM
రష్యాలోని కామ్చట్కా ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. తూర్పు తీరానికి 127 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. రెక్టర్ స్కేలుపై తీవ్రత 7.8 గా నమోదైంది. సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: రష్యాలోని కామ్చట్కా ద్వీపకల్పం తూర్పు తీరంలో శుక్రవారం తెల్లవారుజామున మరో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రెక్టర్ స్కేలుపై 7.8గా నమోదైంది. పెట్రోపావ్లోస్క్-కామ్చాట్స్కీ ప్రాంతం తూర్పు తీరానికి 127 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టు అమెరికా జియోలాజికల్ సర్వే పేర్కొంది. 5.8 తీవ్రతతో పలుమార్లు స్వల్ప ప్రకంపనలు కూడా సంభవించాయని తెలిపింది. సునామీ హెచ్చరికలను కూడా జారీ చేసింది. అయితే, ఈ ఘటనలో అందరూ క్షేమంగానే ఉన్నట్టు తెలుస్తోంది. భూప్రకంపనలకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి (Kamchatka earthquake 7.8 magnitude).
కామ్చట్కా ప్రాంతానికి సునామీ హెచ్చరికలు జారీ చేసినట్టు ఆ ప్రాంత గవర్నర్ శుక్రవారం తెలిపారు. అయితే, ఆస్తి, ప్రాణనష్టం జరిగినట్టు ఇప్పటివరకూ ఎలాంటి సమాచారం లేదని అన్నారు. ఎమర్జెన్సీ సర్వీసులను హైఅలర్ట్‌లో పెట్టినట్టు తెలిపారు. కామ్చట్కా ద్వీపకల్పానికి సమీపంలో ఉన్న కురిల్ ద్వీపాల్లో కూడా సునామీ హెచ్చరికలు జారీ చేశారు. అమెరికాలోని అలాస్కా ప్రాంతానికి కూడా సునామీ హెచ్చరికలు జారీ చేశామని అమెరికా వాతావరణ శాఖ పేర్కొంది. ఆ తరువాత పరిస్థితిని అనుసరించి సునామీ వార్నింగ్‌ను ఉపసంహరించుకున్నట్టు తెలిపింది. కామ్చట్కా ద్వీపకల్పంలోని పెట్రోపావ్లోస్క్-కామ్చాట్సీ ప్రాంతానికి భూకంపం ముప్పు ఎప్పుడూ పొంచి ఉంటుంది. ఈ ముప్పు అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో ఇదీ ఒకటి.
ఇవి కూడా చదవండి:
చాబహార్ పోర్టుపై భారత్‌కు ఇచ్చిన మినహాయింపులు రద్దు.. అమెరికా నిర్ణయం
అమెరికా చట్టసభల భవనం ఎదురుగా ట్రంప్ బంగారు విగ్రహం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయం
Updated Date - Sep 19 , 2025 | 07:39 AM