Kapil Sharma Cafe: కపిల్ శర్మ కేఫ్‌పై మళ్లీ కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హెచ్చరిక
ABN, Publish Date - Aug 07 , 2025 | 08:58 PM
ప్రముఖ హాస్యనటుడు కపిల్ శర్మ ఓపెన్ చేసిన Kap's Café మరోసారి దాడికి గురైంది. కెనడాలోని సరీ ప్రాంతంలో ఉన్న ఈ క్యాఫే వద్ద గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. గతంలోనూ ఇదే రెస్టారెంట్‌పై ఈ తరహా ఘటన చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది.
ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ కొత్తగా ఓపెన్ చేసిన రెస్టారెంట్ Kap's Café పై మరోసారి కాల్పులు జరిగాయి. ఈ ఘటన కెనడాలోని సరీలో జరిగింది. ఇది ఈ క్యాఫేపై రెండో కాల్పుల దాడి కావడం విశేషం. జూలై 8న తొలి సారి ఈ క్యాఫేపై కాల్పులు జరిగాయి. అప్పట్లో క్యాఫే గోడలు, కిటికీలపై పది వరకు బుల్లెట్ హోల్స్ కనిపించాయి. దీనిపై పోలీసులు విచారణ ప్రారంభించారు. కానీ ఇప్పటి వరకూ దాడి వెనక ఎవరు ఉన్నారన్న విషయంపై స్పష్టత రాలేదు.
మళ్లీ అదే స్థలంలో కాల్పులు
ఇప్పటికే మూసేన క్యాఫే ఇటీవలే తిరిగి ప్రారంభించగా, మళ్లీ అదే Kap's Café పై ఫైరింగ్ జరిగింది. ఈసారి కిటికీలపై ఆరు వరకు బుల్లెట్ హోల్స్ కనిపించాయి. కాల్పులు జరిగినప్పుడు క్యాఫే లోపల స్టాఫ్ సభ్యులు ఉన్నారు. కానీ ఎవరికీ గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు.
ఈ దాడికి సంబంధించి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సోషల్ మీడియా వేదికగా బెదిరింపు మెసేజ్‌ను పోస్ట్ చేసింది. అతనికి కాల్ చేశాం, కానీ ఫోన్ తీయలేదు. అందుకే యాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా స్పందించకపోతే, తదుపరి చర్య ముంబయిలో తీసుకుంటామన్నారు. ఈ బెదిరింపుతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. ముంబయి పోలీసులు కూడా ఈ బెదిరింపు పోస్టును పరిశీలిస్తున్నారు.
కపిల్ శర్మ టీం నుంచి స్పందనలేదే
ఇంతటి ఘటనలు జరుగుతున్నా, ఇప్పటి వరకూ కపిల్ శర్మ టీం నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కపిల్ సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నారు. భారతదేశంలో అనేక మంది అభిమానులను సంపాదించుకున్న కపిల్ శర్మ తన వ్యాపారాన్ని అంతర్జాతీయ స్థాయికి విస్తరించే క్రమంలో ప్రారంభించిన ఈ రెస్టారెంట్, ఇటీవలి కాలంలో వరుస ఘటనలతో వార్తల్లో నిలుస్తోంది.
ఇవి కూడా చదవండి
ఇలా ఇన్వెస్ట్ చేయండి..రెండేళ్లలోనే రూ. 10 లక్షలు పొందండి..
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Aug 07 , 2025 | 08:59 PM