ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Kabul Blasts: కాబూల్‌ మీద వరుస వైమానిక దాడులు.. అనేక ప్రాంతాల్లో భారీ పేలుళ్లు

ABN, Publish Date - Oct 10 , 2025 | 08:18 AM

ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌ బాంబులతో దద్దరిల్లింది. నగరంలోని అనేక చోట్ల రాత్రి పేలుళ్లు, కాల్పుల శబ్దాలు వినిపించాయి. మృతుల సంఖ్య వెల్లడికాలేదు. ఈ పేలుళ్లలో పాకిస్తాన్ పాత్ర ఉందని భావిస్తున్నారు.

Afghanistan explosions

ఇంటర్నెట్ డెస్క్: ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌ బాంబులతో దద్దరిల్లింది. నగరంలోని అనేక చోట్ల రాత్రి పేలుళ్లు, కాల్పుల శబ్దాలు వినిపించాయి. స్థానిక, విదేశీ మీడియా అందిస్తున్న సమాచారం ప్రకారం, రాత్రి వేళ ఈ పేలుళ్లు సంభవించినట్టు చెబుతున్నారు. అయితే, మృతుల సంఖ్య ఇంకా స్పష్టంగా వెల్లడించలేదు.

అయితే, ఈ వైమానిక దాడులు ఎవరు చేశారనే దానిపై స్పష్టత లేదు. గుర్తు తెలియని విమానాల ద్వారా వైమానిక దాడులు జరిగినట్టు సోషల్ మీడియా పోస్ట్‌లు పేర్కొన్నాయి. కొన్ని హ్యాండిల్స్ ఈ దాడుల వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని అంటున్నాయి. కాగా, తాలిబన్ తాత్కాలిక పరిపాలన ప్రధాన ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ పేలుళ్లపై దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారని స్థానిక మీడియా వెల్లడించింది.

భారత్‌‌‌ తో ఆర్థిక సంబంధాలను పెంచుకునే లక్ష్యంతో చర్చల కోసం ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి భారతదేశానికి చేరుకున్న సమయంలో కాబూల్‌లో పేలుళ్లు సంభవించిడం విశేషం. 2021లో అధికారం చేజిక్కించుకున్న తర్వాత తాలిబన్ నాయకుడు భారతదేశానికి చేసిన మొదటి పర్యటన ఇది.

కాగా, సరిహద్దు వివాదం కారణంగా తాలిబన్-పాకిస్తాన్ ప్రభుత్వాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నందున ఈ పేలుళ్లలో పాకిస్తాన్ పాత్ర ఉందని భావిస్తున్నారు. ఇటీవల, సరిహద్దులో తాలిబన్-పాకిస్తాన్ సైన్యం మధ్య ఘర్షణలు కూడా జరిగాయి.

ఇవి కూడా చదవండి

జంతు ప్రపంచంలో భీకరపోరు .. తల్లీకూతుళ్ల యుద్ధం

మధ్యంతర ఉత్తర్వులు వెబ్‌సైట్‌లో పెట్టండి

Updated Date - Oct 10 , 2025 | 07:44 AM

Updated Date - Oct 10 , 2025 | 08:18 AM