Japan Earthquake: జపాన్ తీరంలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
ABN, Publish Date - Dec 08 , 2025 | 08:47 PM
జపాన్ ఉత్తర తీరంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 7.6గా నమోదైంది. భూకంప తీవ్రత దృష్ట్యా అక్కడి మెటియొరొలాజికల్ ఏజెన్సీ సునామీ హెచ్చరికలను కూడా జారీ చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: జపాన్ ఉత్తర తీరంలో సోమవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రత నమోదయ్యింది. హక్కాయిడో ద్వీపంలోని తీరప్రాంత రాజధాని అమోరీకి సమీపంలో సముద్రం అడుగున 50 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు జపాన్ మెటియొరొలాజికల్ ఏజెన్సీ వెల్లడించింది. సునామీ అలర్ట్ కూడా జారీ చేసింది. సుమారు 3 మీటర్ల మేర అలలు తీరాన్ని తాకే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అక్కడి అణువిద్యుత్ కేంద్రాల్లో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు.ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వీలుగా విద్యుత్ కేంద్రాల్లో తనిఖీలను ముమ్మరం చేశారు (Japan Earthquake).
భూకంప కేంద్రానికి 1000 కిలోమీటర్ల పరిధిలోని తీర ప్రాంతాలకు సునామీ ముప్పు పొంచి ఉందని జపాన్ అధికారులు తెలిపారు. జపాన్‌తో పాటు రష్యాకు కూడా సునామీ ముప్పు ఉందని తెలిపారు. జపాన్‌లోని హక్కాయిడో, ఆమోరీ, ఇవాటే ప్రిఫెక్చర్లకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి.
పలు భూఫలకాలు (టెక్టానిక్ ప్లేట్స్) కలిసే ప్రాంతంలో జపాన్ ఉండటంతో అక్కడ భూకంపాల ముప్పు ఎక్కువని నిపుణులు చెబుతున్నారు. పసిఫిక్ ప్లేట్, ఫిలిప్పీన్ సీ ప్లేట్, యూరేసియన్ ప్లేట్, నార్త్ అమెరికన్ ప్లేట్ కలిసే ప్రాంతంలో జపాన్ ఉందని జియాలజిస్టులు వివరిస్తున్నారు. భూఫలకాలు పరస్పరం ఢీకొనడం వల్ల భూకంపాలు సంభవిస్తుంటాయి. జపాన్‌కు ఈ ముప్పు మరింత ఎక్కువ.
ఇవీ చదవండి:
హమాస్, ఎల్‌ఈటీ మధ్య సంబంధాలు.. భారత్‌కు ఇజ్రాయెల్ కీలక విజ్ఞప్తి
వివిధ దేశాల నుంచి భారతీయుల డిపోర్టేషన్.. వివరాలను వెల్లడించిన కేంద్రం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Dec 08 , 2025 | 09:40 PM