PM Modi birthday: మీరు ఎంతో మందికి స్ఫూర్తి.. ప్రధాని మోదీకి ఇటలీ పీఎమ్ బర్త్ డే విషెస్..
ABN, Publish Date - Sep 17 , 2025 | 04:00 PM
భారత ప్రధాని నరేంద్ర మోదీ 75వ పుట్టిన రోజును పురష్కరించుకుని పలు దేశాల అధినేతలు, ప్రధాన మంత్రులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మోదీకి ఫోన్ చేసి మరీ విషెస్ చెప్పిన సంగతి తెలిసిందే.
భారత ప్రధాని నరేంద్ర మోదీ 75వ పుట్టిన రోజును పురష్కరించుకుని పలు దేశాల అధినేతలు, ప్రధాన మంత్రులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మోదీకి ఫోన్ చేసి మరీ విషెస్ చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోనీ (Giorgia Meloni) కూడా ప్రధాని మోదీకి సోషల్ మీడియా ద్వారా విషెస్ చెప్పారు. ప్రధాని మోదీ నాయకత్వాన్ని, ఆయన దార్శనికతను ప్రశంసించారు (PM Modi birthday).
'భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి 75వ పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన బలం, దృఢ సంకల్పం, లక్షలాది మందిని నడిపించే సామర్థ్యం స్ఫూర్తిదాయకం. భారతదేశాన్ని ఉజ్వల భవిష్యత్తు వైపు నడిపించడానికి, మన ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఆయనకు ఆరోగ్యం, శక్తి కలగాలని కోరుకుంటున్నాను' అంటూ జార్జియా మోలోనీ ట్వీట్ చేశారు (Italy India relations).
ఈ సందర్భంగా ప్రధాని మోదీతో కలిసి తీసుకున్న ఫొటోను పంచుకున్నారు. ప్రధాని మోదీతో కలిసి గతంలో తీసుకున్న సెల్ఫీ ఫొటోను జార్జియా మెలోనీ జత చేశారు (international wishes PM Modi). ప్రధాని మోదీని 'స్నేహితుడు' అని అభివర్ణిస్తూ, ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ కూడా బర్త్‌డే విషెస్ చెప్పారు. భారతదేశంతో బలమైన బంధాన్ని పంచుకోవడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. అలాగే న్యూజిలాండ్ ప్రధాన మంత్రి క్రిస్టోఫర్ లక్సన్ కూడా సోషల్ మీడియా ద్వారా మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ఆపరేషన్ సిందూర్‌లో మసూద్ అజార్ కుటుంబం ముక్కచెక్కలు.. వెల్లడించిన జైషే కమాండర్
భారత్‌తో మా బంధాన్ని తెంచేందుకు చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి: రష్యా విదేశాంగ శాఖ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..
Updated Date - Sep 17 , 2025 | 04:00 PM