Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌లో మసూద్ అజార్ కుటుంబం ముక్కచెక్కలు.. వెల్లడించిన జైషే కమాండర్
ABN , Publish Date - Sep 16 , 2025 | 03:20 PM
బహవలాపూర్‌లోని భారీ కాంప్లెక్స్‌పై భారత వాయుసేన జరిపిన దాడుల్లో తన కుటుంబానికి చెందిన 10 మంది సభ్యులు, నలుగురు సన్నిహితులు ప్రాణాలు కోల్పోయినట్టు మసూద్ అజార్ గత మేలో వెల్లడించారు.
ఇస్లామాబాద్: పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack)కి ప్రతీకారంగా భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' (Operation Sindoor) పాక్‌లోని ఉగ్రవాదుల వెన్నులో చలిపుట్టించింది. ఉగ్రవాదుల రహస్య స్థావరాలపై భారత ఆర్మీ విరుచుకుపడి వాటిని నేలమట్టం చేసింది. ఈ దాడుల్లో జైషే మహ్మద్ (JeM) చీఫ్ మసూద్ అజార్ (Masood Azhar) కుటుంబంలోని పలువురు ప్రాణాలు కోల్పోయారు. జైషే కమాండర్ మసూద్ ఇలియాస్ కశ్మీరీ తాజాగా ఈ విషయాన్ని అంగీకరించారు. మే 7న భారత దళాలు బహవల్‌పూర్‌లోని జైషే ప్రధాన కార్యాలయంపై జరిపిన దాడుల్లో అజార్ కుటుంబం ముక్కలైందని కశ్మీరీ తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
'ఉగ్రవాదాన్ని స్వీకరించి దేశ సరిహద్దులను కాపాడేందుకు ఢిల్లీ, కాబూల్, కాందహార్‌లతో పోరాడాం. ఇందుకోసం మేము అన్నీ త్యాగం చేశాం. మే 7న భారత దళాలు బహవలాపూర్‌లో జరిపిన దాడుల్లో మౌలానా మసూద్ అజార్ కుటుంబ ముక్కలైంది' అని కశ్మీరీ ఆ వీడియోలో పేర్కొన్నారు. పంజాబ్‌లోని బహవలాపూర్‌లోని భారీ కాంప్లెక్స్‌పై భారత వాయుసేన జరిపిన దాడుల్లో తన కుటుంబానికి చెందిన 10 మంది సభ్యులు, నలుగురు సన్నిహితులు ప్రాణాలు కోల్పోయినట్టు మసూద్ అజార్ గత మేలో వెల్లడించారు. అజార్ చెప్పిన కాంప్లెక్స్‌ను జైషే ఆపరేషన్ హెడ్‌క్వార్టర్స్‌గా ఆ తర్వాత గుర్తించారు.
పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో పాక్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలు నేలమట్టమయ్యాయి. 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు.
ఇవి కూడా చదవండి..
న్యూయార్క్ టైమ్స్‌పై ట్రంప్ గుస్సా.. రూ.1.32 లక్షల కోట్లకు పరువు నష్టం దావా
భారత్‌తో మా బంధాన్ని తెంచేందుకు చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి: రష్యా విదేశాంగ శాఖ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయం