Israel Gaza conflict: గాజాను స్వాధీనం చేసుకుంటాం
ABN, Publish Date - May 20 , 2025 | 04:44 AM
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు గాజా ప్రాదేశికంపై పూర్తి పట్టు సాధించాలని, వెనక్కు తగ్గే పనిలేదని స్పష్టం చేశారు. ఆయన అనగా పాక్షిక ఆచరణాత్మక చర్యలతో పాటుగా పాలస్తీనియన్లకు ఆహార సహాయం కూడా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు.
జెరూసలేం, మే 19: గాజాను పూర్తిగా స్వాధీనం చేసుకుంటామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సోమవారం స్పష్టం చేశారు. ‘గాజా ప్రాదేశిక ప్రాంతంపై పూర్తి పట్టు సాధిస్తాం. వెనక్కు తగ్గే ప్రసక్తే లేదు’ అని సోషల్ మీడియా వేదిక టెలిగ్రామ్‌లో నెతన్యాహు వీడియో పోస్ట్ చేశారు. అదే సమయంలో ఆచరణాత్మక, దౌత్య పరమైన కారణాల రీత్యా పాలస్తీనియన్లు కరువు బారిన పడకుండా నిలువరించాల్సి ఉందన్న నెతన్యాహు.. అందుకు గాజాకు ఆహార పదార్థాలు పంపుతామని చెప్పారు. తమ మిత్రదేశాలు కూడా సామూహిక ఆకలి చావుల చిత్రాలను సహించబోవన్నారు.
ఇవీ చదవండి:
Operation Sindoor: మౌనం విపత్కరం.. జైశంకర్‌పై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు, బీజేపీ కౌంటర్
భారత్ దాడి చేసిందని ఆర్మీ చీఫ్ ఫోన్ చేశాడు.. నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని..
ఇద్దరు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులను అరెస్టు చేసిన ఎన్ఐఏ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - May 20 , 2025 | 04:44 AM