Israel Gaza airstrikes: గాజాపై ఇజ్రాయెల్ దాడుల్లో 84 మంది మృతి
ABN, Publish Date - May 15 , 2025 | 04:30 AM
ఇజ్రాయెల్ గాజాలో వైమానిక దాడుల్లో 84 మంది, అందులో 22 చిన్నారులు మరణించారు. హమాస్ నుండి బందీగా ఉన్న అమెరికన్ జాతీయుడి విడుదల తర్వాత ఈ దాడులు కొనసాగాయి.
గాజా, మే 14: హమా్‌సను తుదముట్టించే చర్యల్లో భాగంగా ఇజ్రాయెల్... గాజాలో జరిపిన వైమానిక దాడుల్లో 84 మంది మృతిచెందారు. వీరిలో 22 మంది చిన్నారులున్నారు. ఖాన్ యూని్‌సతో పాటు ఉత్తర గాజాలోని పలు ప్రాంతాల్లో ఈ దాడులు కొనసాగాయి. హమాస్ తమ వద్ద బందీగా ఉన్న అమెరికన్ జాతీయుడిని విడుదల చేసిన మరుసటి రోజే ఈ దాడులు జరిగాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖతార్‌లో పర్యటిస్తుండగా, హమా్‌స-ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందం కోసం మధ్యవర్తులు దోహాలో సమావేశమవుతున్న తరుణంలో ఈ దాడులు జరగడం కలకలం రేపింది. హమాస్ వద్ద బందీలుగా ఉన్న వారినందరినీ విడుదల చేసేదాకా దాడులు కొనసాగుతాయని ఇజ్రాయెల్ ఇప్పటికే స్పష్టం చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
Operation Sindoor: మసూద్ అజార్‌కు రూ. 14 కోట్లు చెల్లించనున్న పాక్
Donald Trump: అమెరికాకు సౌదీ బహుమతి.. స్పందించిన ట్రంప్
Teachers in Class Room: క్లాస్ రూమ్‌లోనే దుకాణం పెట్టిన హెడ్ మాస్టర్లు.. వీడియో వైరల్
For AndhraPradesh News And Telugu News
Updated Date - May 15 , 2025 | 04:30 AM