Iran Attack: ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులు.. ట్రంప్ ప్రకటన వెలువడిన కొన్ని గంటలకే..
ABN, Publish Date - Jun 24 , 2025 | 10:09 AM
ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే ఇరాన్ ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడులకు దిగింది. బేర్షివా నగరంపై జరిగిన ఈ దాడుల్లో ముగ్గురు మరణించారు. నివాస భవనాలు కూడా ధ్వంసం అయ్యాయి.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడి కాల్పుల విరమణ ప్రకటన వెలువడిన కొన్ని గంటలకే ఇరాన్ ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడులు చేసింది. బేర్షీవా నగరంపై మంగళవారం జరిగిన ఈ దాడుల్లో ముగ్గురు మరణించారు. పలు భవనాలు ధ్వంసం అయ్యాయి. ఇరాన్ దాడిలో ధ్వంసమై ఓ నివాస భవనం దృశ్యాలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఘటన ప్రాంతంలో దగ్ధమైన కార్లు, చెట్లు కనిపించాయి. ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటన తరువాత ఇరాన్ ఈ దాడులు చేసిందని అక్కడి ప్రభుత్వ మీడియా వెల్లడించింది. జూన్ 13న ఇరాన్ అణు, మిలిటరీ స్థావరాలపై ఇజ్రాయెల్ ఆకస్మిక వైమానిక దాడులు చేసిన నాటి నుంచి ఇరు దేశాలు ఒకదానిపై మరొకటి మిసైళ్లు ప్రయోగించుకుంటున్నాయి.
ఇదిలా ఉంటే, గ్రినిచ్ మెరీడియన్ టైమ్ ప్రకారం ఉదయం 4 నాలుగు గంటలకు ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ అమలవుతుందని ట్రంప్ పేర్కొన్నారు. ఈ విషయంపై ఇజ్రాయెల్ నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదు. ఇజ్రాయెల్ దాడులు ఆపితే తాము ప్రతిదాడులు చేయబోమని ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి తెలిపారు.
ఇరాన్ మిసైల్ దాడులు కొనసాగుతున్నా ఇజ్రాయెల్‌లో మృతుల సంఖ్య కూడా పరిమితంగానే ఉంది. మిసైల్ దాడుల గురించి ఎప్పటికప్పుడు ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రజలను ఫోన్ అలర్టులు, ఎస్‌ఎమ్ఎస్‌ల ద్వారా హెచ్చరిస్తోంది. ఆ తరువాత సైరెన్లు మోగిస్తోంది. తమ ఇళ్లకు సమీపంలోని మిసైల్ దుర్బేధ్యమైన షెల్టర్‌లలో దాక్కోవాలని చెబుతోంది. తన గగనతల రక్షణ వ్యవస్థ ద్వారా అధిక శాతం ఇరాన్ మిసైళ్లను గాల్లోనే ధ్వంసం చేస్తోంది.
ఇవీ చదవండి:
ఇజ్రాయెల్- ఇరాన్ యుద్ధం ముగిసింది.. ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్
జీబీయూ-57 బంకర్ బస్టర్ బాంబులతో ఇరాన్‌పై దాడి.. వీటి శక్తి ఎంతో తెలిస్తే..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 24 , 2025 | 10:55 AM