UN Peacekeeping Forces: ప్రపంచ శాంతి పరిరక్షణలో భారత సైనిక దళాలదే పైచేయి
ABN, Publish Date - Oct 05 , 2025 | 04:22 PM
ప్రపంచ శాంతిని పరిరక్షించడంలో భారత సైనిక దళాలు ప్రపంచంలోనే అత్యంత ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి పంపించే శాంతి దళాల్లో ఎక్కువ మంది భారత సైనికులే కావడం విశేషం. 50కి పైగా మిషన్లకు 2,90,000 మందితో కూడిన..
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ శాంతిని పరిరక్షించడంలో భారత సైనిక దళాలు ప్రపంచంలోనే అత్యంత ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. UN తాత్కాలిక భద్రతా దళం (UNISFA) ప్రపంచంలోని కల్లోలిత ప్రాంతాల్లో శాంతి స్థాపనకు సైన్యాన్ని మోహరించి శాంతిభద్రతల్ని కాపాడుతుంది. ఇందుకోసం ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి సైన్యాన్ని సమీకరించి ఆయా ప్రాంతాల్లో మోహరిస్తుంది. ఇలా ఐక్యరాజ్యసమితి పంపించే దళాల్లో ఎక్కువ మంది భారత సైనికులే కావడం విశేషం.
ఇలా ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితి తాత్కాలిక భద్రతా దళాల్లో భారతదేశానికి చెందిన సైనిక పరిశీలకులు, సిబ్బంది, అధికారులు ఉన్నారు. ఇది ప్రపంచ శాంతిభద్రతలకు భారతదేశపు అచంచలమైన నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. 1950ల నుంచి భారత్ ప్రపంచవ్యాప్తంగా 50కి పైగా మిషన్లకు 2,90,000 మందితో కూడిన శాంతి పరిరక్షక దళాలను పంపింది.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్.. ఎట్టకేలకు అమరావతిలోని సీఆర్డీఏ భవనానికి మోక్షం
వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు
Read Latest AP News And Telugu News
Updated Date - Oct 05 , 2025 | 06:02 PM