India-Srilanka: శ్రీలంకకు భారత్ ఆపన్నహస్తం.. 'ఆపరేషన్ సాగర్ బంధు' పేరిట సహాయకచర్యలు
ABN, Publish Date - Dec 02 , 2025 | 10:01 AM
భారీ వర్షాలు, వరదలతో కొట్టుమిట్టాడుతోన్న శ్రీలంకకు భారత్ ఆపన్న హస్తం అందిస్తోంది. ప్రపంచదేశాల్లోనే మొట్టమొదట స్పందించిన దేశంగా భారత్ నిలిచింది. భారతదేశం అందిస్తోన్న సాయానికి 'థ్యాంక్యూ ఇండియా' అంటూ శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది.
ఇంటర్నెట్ డెస్క్: భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన శ్రీలంకకు భారత్ సహాయ, సహకారాలు అందిస్తోంది. శ్రీలంకలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో భారత ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ముమ్మరంగా సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఆపదలో ఉన్నవారిని రక్షిస్తున్నాయి.
'ఆపరేషన్ సాగర్ బంధు' పేరిట శ్రీలంకలో భారత్ సహాయక చర్యలు నిర్వహిస్తోంది. ఇప్పటివరకూ 53 టన్నుల రిలీఫ్ మెటీరియల్‌ను భారత్ అందించిందని శ్రీలంక ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు తన అధికారిక సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
భారత వాయుసేనకి చెందిన ఇండిక్-130జే విమానాల ద్వారా ఈ సహాయ సామగ్రిని శ్రీలంకకు తరలించారు. శ్రీలంకకు మొదటి దఫా సాయంగా తొలివిడత సామగ్రిని పంపించామని, సహాయక చర్యలు కొనసాగుతాయని భారత రాయబారి కార్యాలయం ప్రకటించింది.
కాగా, శ్రీలంకలో తాజాగా సంభవించిన వరదల్లో 334 మంది మరణించగా, లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. భారత్ తమ వంతుగా ఆహారం, వైద్య సామగ్రి, అత్యవసర సదుపాయాలను అందిస్తోంది.
ఈ విషయాన్ని ఎక్స్‌లో పోస్ట్ చేసిన శ్రీలంక ప్రభుత్వం.. భారతదేశానికి ధన్యవాదాలు తెలిపుతూ భావోద్వేగ వీడియో షేర్ చేసింది. భారత్-శ్రీలంక దేశాల మధ్య ఈ సహకారం రెండు దేశాల మధ్య సోదరభావాన్ని మరింత బలోపేతం చేస్తుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఐఏఎస్ అధికారి కుమార్తె ఆత్మహత్య
Read Latest Telangana News and National News
Updated Date - Dec 02 , 2025 | 12:49 PM