ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

India vs Pakistan: భారత్ నిషేధం.. ధరల పెరుగుదలతో ఆపసోపాలు పడుతున్న పాకిస్థాన్

ABN, Publish Date - Jun 30 , 2025 | 08:28 AM

పాకిస్థాన్‌కు సరుకు రవాణా చేసే నౌకలపై మే 2వ తేదీన నిషేధం విధించింది భారత్. ఈ నిషేధంతో పాకిస్థాన్ తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. దీంతొ ఎగుమతులు, దిగుమతుల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటోందని ఆ దేశ పత్రిక 'డాన్' వెల్లడించింది.

ndia bans pakistan

పహల్గాం ఉగ్రదాడికి (Pahalgam terror attack) ప్రతిచర్యగా భారత్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు పాకిస్థాన్‌ (Pakistan)కు శరాఘాతంగా మారుతున్నాయి. భారత ఓడరేవుల నుంచి పాకిస్థాన్‌కు సరుకు రవాణా చేసే నౌకలపై భారత్ మే 2వ తేదీన నిషేధం విధించింది. ఈ నిషేధంతో పాకిస్థాన్ తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. భారత్ నిషేధంతో పాక్ ఎగుమతులు, దిగుమతుల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటోందని ఆ దేశ పత్రిక 'డాన్' వెల్లడించింది (India bans pakistan).

భారత ఓడరేవుల నుంచి పాకిస్థాన్‌కు సరుకు రవాణా చేసే నౌకలపై నిషేధం విధించడంతో వేరే రూట్లో సరుకును రవాణా చేయాల్సి వస్తోంది. దీంతో పాకిస్థాన్‌కు రవాణా 30 నుంచి 50 రోజుల వరకు ఆలస్యం జరుగుతోందట. అలాగే ఆ రూట్ చాలా దూరం కావడంతో రవాణా ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయట. షిప్పింగ్ ఖర్చులు పెరగడం, బీమా ధరలు పెరగడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అక్కడి వస్త్ర ఎగమతిదారులు వాపోతున్నారు.

2019లో జరిగిన పుల్వామా దాడి తర్వాతి నుంచి పాకిస్థాన్, భారత్ మధ్య ఎగుమతులు, దిగుమతులు భారీగా తగ్గిపోయాయి. పాకిస్థాన్ నుంచి అన్ని వస్తువులపైనా కేంద్రం 200 శాతం పన్ను విధిస్తోంది. 2018లో ఇరు దేశాల మధ్య ట్రేడ్ వేల్యూ 2.41 బిలియన్ డాలర్లు కాగా, 2024లో అది 1.2 బిలియన్లకు పడిపోయింది. అలాగే 2019లో పాకిస్థాన్ నుంచి భారత్‌కు జరిగిన ఎగుమతుల విలువ రూ.4 వేల కోట్లకు పైనే ఉండేది. 2024లో మాత్రం అది కేవలం రూ.4 కోట్లకు పడిపోయింది.

Also Read:

యువ రచయిత సూరాడ ప్రసాద్‌కు సీఎం చంద్రబాబు అభినందనలు..

నా శత్రువు పెద్దారెడ్డి మాత్రమే...

For More Telugu News

Updated Date - Jun 30 , 2025 | 04:11 PM