ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

India China relations: భారత్, చైనా శత్రవులు కాదు.. ఏనుగు, డ్రాగన్ కలిసి నాట్యం చేయాలి: జిన్‌పింగ్

ABN, Publish Date - Sep 01 , 2025 | 08:03 AM

సరిహద్దు వివాదాలను పక్కన పెట్టేసి, అన్ని రంగాల్లోనూ కలిసి పని చేయాలని భారత్, చైనాలు నిర్ణయించుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై సుంకాల దాడికి దిగడంతో ప్రధాని మోదీ అప్రమత్తమయ్యారు. చైనాతో కలిసి ముందుకెళ్లాలని కీలక నిర్ణయం తీసుకున్నారు.

Modi Xi meeting

సరిహద్దు వివాదాలను పక్కన పెట్టేసి, అన్ని రంగాల్లోనూ కలిసి పని చేయాలని భారత్, చైనాలు నిర్ణయించుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై సుంకాల దాడికి దిగడంతో ప్రధాని మోదీ అప్రమత్తమయ్యారు. చైనాతో కలిసి ముందుకెళ్లాలని కీలక నిర్ణయం తీసుకున్నారు (Modi Xi meeting). ఈ నేపథ్యంలో షాంఘై సహకార సదస్సులో పాల్గొనేందుకు చైనాలోని తియాన్‌జిన్‌కు చేరుకున్న మోదీకి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఘన స్వాగతం పలికారు. నేతలు ఇద్దరూ దాదాపు 50 నిమిషాల పాటు సమావేశమయ్యారు (India China partnership).

ఇరు దేశాలు ఆర్థిక సంబంధాలు, పెట్టుబడులను విస్తరించుకుంటూ ప్రపంచ వాణిజ్యాన్ని స్థిరపరిచేందుకు ప్రయత్నించాలని, ఇరు దేశాలు కలిసి లాభపడాలని నేతలిద్దరూ అంగీకారానికి వచ్చారు. 'మనం శత్రువులం కాదు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకున్నంత వరకు ఇరు దేశాల మధ్య సంబంధాలు స్థిరంగా, నిలకడగా కొనసాగుతాయి. డ్రాగన్, ఏనుగు కలిసి నాట్యం చేయాలి. ఇరు దేశాలకు అదే సరైన ఎంపిక. ఇరు దేశాల మధ్య వివాదాలను సామరస్యపూర్వకంగా చర్చించుకోవాలి' అని జిన్‌పింగ్ సూచించారు (India China diplomacy).

సరిహద్దు ప్రాంతంలో శాంతి, సామరస్యతలను కాపాడుకునేందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు (India China cooperation). ద్వైపాక్షిక వాణిజ్యాన్ని, పెట్టుబడుల భాగస్వామ్యాన్ని ఇరు దేశాలు కలిసి విస్తరించుకోవాలని సూచించారు. మూడో దేశం కోణం నుంచి ఇరు దేశాల మధ్య బంధాలను చూడవద్దని మోదీ కోరారు. 2026లో భారత్‌లో జరిగే బ్రిక్స్ సదస్సుకు హాజరు కావాలని జిన్‌పింగ్‌ను మోదీ ఆహ్వానించారు. ఎన్‌సీఓకు చైనా నేతృత్వం వహించడాన్ని స్వాగతించారు. అలాగే బ్రిక్స్‌కు భారత్ సారథ్యం వహించేందుకు తాము మద్దతు ఇస్తామని జిన్‌పింగ్ స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి:

భారత్‌పై మీరూ ఆంక్షలు విధించండి.. ఐరోపా దేశాలకు అమెరికా సూచన

అమెరికాకు అన్ని పోస్టల్‌ పార్శిళ్లు బంద్‌.. భారత్ నిర్ణయం

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 01 , 2025 | 08:03 AM