ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

H1B visa 2025: గుడ్ న్యూస్.. హెచ్1బీ వీసా ఫీజు కట్టాల్సింది వాళ్లే.. గైడ్ లైన్స్ విడుదల..

ABN, Publish Date - Oct 21 , 2025 | 09:24 AM

అమెరికాలో ఉండి చదువుకుంటున్న వారికి గుడ్ న్యూస్. హెచ్-1బీ వీసా ఫీజు విషయంలో వారికి భారీ ఊరట లభించింది. ఇప్పటికే అమెరికాలో ఉండి చదువుకుంటున్న వారు పెంచిన లక్ష డాలర్ల ఫీజు విషయంలో ఆందోళన చెందనక్కర్లేదు.

H1B fee exemption

అమెరికాలో ఉండి చదువుకుంటున్న వారికి గుడ్ న్యూస్. హెచ్-1బీ వీసా ఫీజు విషయంలో వారికి భారీ ఊరట లభించింది. ఇప్పటికే అమెరికాలో ఉండి చదువుకుంటున్న వారు పెంచిన లక్ష డాలర్ల ఫీజు విషయంలో ఆందోళన చెందనక్కర్లేదు. హెచ్1బీ వీసా కోసం పెంచిన ఫీజు బయటి దేశాల నుంచి వచ్చే దరఖాస్తుదారులకే వరిస్తుంది (USCIS H1B fee guidance).

పెంచిన హెచ్1బీ ఫీజు విషయంలో అమెరికా పౌరసత్వం, వలస సేవల సర్వీస్ (USCIS) తాజాగా కీలక ప్రకటన వెలువరించింది ($100000 visa fee). ఆ ప్రకటన ప్రకారం.. ఇప్పటికే అమెరికాలో చదువుకుంటూ హెచ్1బీ వీసా దరఖాస్తు చేసుకునే వారు లక్ష డాలర్ల ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. అయితే బయటి దేశాల్లో చదువుకుని అమెరికాలో ఉద్యోగం కోసం హెచ్‌1బీ వీసాకు దరఖాస్తు చేసుకునే వారు మాత్రం లక్ష డాలర్లు ఫీజు కట్టాల్సిందేనని అమెరికా ఇమిగ్రేషన్ సర్వీస్ తెలిపింది.

సెప్టెంబర్ 21న వీసా ఫీజు వెలువడే నాటికే అమెరికాలో ఉన్న వారు ఈ కొత్త ఫీజు కట్టనక్కర్లేదు (H1B fee exemption). సెప్టెంబర్ 21 తర్వాత వచ్చిన దరఖాస్తులకు మాత్రమే లక్ష డాలర్ల ఫీజు వర్తిస్తుంది. ఈ ఫీజు చెల్లింపుల కోసం ఇప్పటికే ఆన్‌లైన్ సేవలు ప్రారంభించినట్టు అమెరికా ఇమిగ్రేషన్ సర్వీస్ తెలిపింది.

ఈ వార్తలు కూడా చదవండి..

ముహూరత్ ట్రేడింగ్ ఏ రోజు, ఎప్పుడు.. పూర్తి వివరాలు మీ కోసం..


దీపావళి రోజున మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..


మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Oct 21 , 2025 | 09:24 AM